హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

కులాల్లో ఎక్కువ శాతం మంది మీరు బయటకు చూడటానికి ఎలా కనిపిస్తున్నారనేదాన్ని గమనిస్తారన్నారు.

|
Google Oneindia TeluguNews

మంచు విష్ణు, లక్ష్మీప్రసన్నలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. మంచు మనోజ్ మీద మాత్రం ట్రోలింగ్ ఉండదు. కాకపోతే ఈమధ్య కాలంలో అతనిపై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల స్టేజ్ పై మాట్లాడే సందర్భంగా నాగబాబును ఉద్దేశించి హయ్యర్ పర్పస్ పదం ట్రోలింగ్ కు దారితీసింది. ఆ తర్వాత నుంచి మంచు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేడు. తాజాగా ఆయన చేసిన పోస్టు ఒకటి వైరలవుతోంది. దీనికి కారణం.. కులమతాలపై చేసిన కామెంట్స్. నెటిజన్లు మనోజ్ ను టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు.

కులాల్లో ఎక్కువ శాతం మంది మీరు బయటకు చూడటానికి ఎలా కనిపిస్తున్నారనేదాన్ని గమనిస్తారన్నారు. హోదా, డబ్బు, పవర్ అనేదాన్ని బట్టి మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. కొంతమంది మీ కార్యరెక్టర్ ను చూసి గౌరవిస్తారు. మీ ఎదుటివారిపై చూపించే మానవత్వం, సమానత్వం, దయ అనేదాన్ని బట్టి మీకు వ్యక్తిగా గౌరవం దొరుకుతుంది అని పోస్టు చేశారు. మంచు మనోజ్ ఉన్నట్లుండి ఒక్కసారిగా మనోజ్ కులాల ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాలేదు. అయితే మనోజ్ ఉద్దేశం మాత్రం మంచిగానే ఉంది. మనిషి బయటకు కనిపించే విధానంలో కాకుండా అంతర్గతంగా ఎలా వ్యవహరిస్తారనేదాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యక్తికి గౌరవం ఇవ్వాలని సూచించారు.

manchu manoj comments on casteism and religion

నెటిజ‌న్లు మాత్రం మంచు మ‌నోజ్‌పై కామెంట్స్ పెడుతున్నారు. మేం హ‌య్య‌ర్ ప‌ర్స‌స్ బ్రో అని ఒక‌రంటే, మ‌రొక‌రేమో అస‌లు నువ్వేమీ సాధిస్తావో బ్రో ఇలా వాగుతున్నావు అన్నారు. కొంద‌రు మాత్రం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇటీవ‌ల మంచు మ‌నోజ్ వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలుస్తున్నారు. సినిమాల పరంగాకన్నా తన వివాహం పరంగానే ఆయన వార్తల్లో ఉంటున్నారు. చాలారోజుల తర్వాత వాట్ ది షిట్ అనే సినిమాను చేస్తున్నారు. అంతేకాకుండా దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్త భూమా మౌనికారెడ్డిని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు.

English summary
A large percentage of castes care about how you look on the outside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X