Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదీ జరిగిందీ - ఫ్యామిలీ వివాదం బయట పెట్టిన మంచు మనోజ్..!!

మంచు ఫ్యామిలీలో వివాదం రోజు కో మలుపు తిరుగుతోంది. కేసులు.. పోలీసుల విచారణలు.. కోర్టు లో వాయిదా ల తరువాత కొంత శాంతించినట్లు కనిపించినా.. మరో సారి వివాదం తెర మీదకు వచ్చింది. తాజాగా తిరుపతిలో తమ కాలేజీ వద్ద లోపలకు రానీయకపోవటం పైన మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా అధికారులను కలిసిన మనోజ్ అసలు తమ ఫ్యామిలీలో వివాదాలకు కారణాలను వెల్లడించారు.

అధికారులకు వివరణ
మంచు మనోజ్ తాజాగా రంగారెడ్డి జిల్లా అదనపు ప్రతిమ సింగ్‌తో సమావేశమయ్యారు. భూ తగాదా ల గురించి చర్చించారు. దీనికి ముందే మోహన్ బాబు జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంత మంది అక్రమంగా ఆక్రమించుకున్నారని జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి, తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు. దీనికి కొనసా గింపుగా మనోజ్ నేరుగా అదనపు కలెక్టర్ ను కలిసి భూముల వ్యవహారాల పైన తన వాదన వినిపిం చారు. కొన్ని రోజులుగా మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్నారు. జల్‌పల్లిలోని ఇంట్లో మంచు మనోజ్ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు.

Manchu Manoj reveals causes for Disuptes in the family key comments on Mohan Babu

ఇదీ జరిగిందీ
మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా మెజిస్ట్రేట్‌ హోదాలో ఉన్న కలెక్టర్ స్పందించారు. పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్.. జల్‌పల్లి ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్‌కు నోటీసు ఇచ్చారు. ఈ నోటీసు మేరకు మంచు మనోజ్.. ఈరోజు అడిషనల్ కలెక్టర్ ముందు విచారణకు హాజరయ్యారు. కొంత సమాచారాన్ని కూడా మంచు మనోజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వివాదం పై మనోజ్ స్పందించారు. అసలు ఆస్తుల గురించి వివాదాలు లేవని చెప్పారు. యూనివర్సిటీలో విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించి నందుకే తన అన్న ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు.

అన్నతోనే సమస్య
తనను ఇంట్లోకి రానీయలేదని మనోజ్ పేర్కొన్నారు. తన కుమార్తె అక్కడే ఉందని గుర్తు చేసారు. తాను ఎక్కడకీ పారిపోవటం లేదని..తన తండ్రిని అడ్డం పెట్టుకొని విష్ణు నాటకం ఆడుతున్నారి మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టోటల ఎపిసోడ్ అందరికీ తెలుసని వ్యాఖ్యానించిన మనోజ్ తాను ఎప్పుడూ తన తండ్రిని వ్యతిరేకించలేదని స్పష్టం చేసారు. తనకు న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా మనోజ్ - విష్ణు మధ్య వార్ కంటి న్యూ అవుతోంది. ఈ సమయంలో అధికారుల ముందుకు వచ్చిన మనోజ్ తన వాదన వినిపించా రు. దీంతో, ఇప్పుడు అధికారుల నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+