రాజకీయ వ్యూహం: తెరపైకి మంద కృష్ణ మాదిగ.. తెర వెనక ఎవరు??
మంద కృష్ణ మాదిగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల హక్కుల కోసం పోరాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసింది. అయితే కోర్టులు ఈ వర్గీకరణను కొట్టేశాయి. పార్లమెంటులో చట్టం చేస్తేనే వాటికి చట్టబద్దత వస్తుందని స్పష్టం చేసింది. పార్లమెంటులో చట్టం చేయడమంటే దేశంలోని అన్ని పార్టీలను ఒప్పించగలగాలి. పిల్లి మెడలో గంట కట్టేవారెవరూ లేకపోవడంతో ఆ చట్టం అలాగే ఉండిపోయింది.
పార్లమెంటులో చట్టం అవనప్పటికీ వర్గీకరణ అంశం మాత్రం రాజకీయాల్లో నానుతూనే ఉంది. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న మంద కృష్ణ మాదిగ పేరు ఇప్పుడు అకస్మాత్తుగా ఏపీలో వినపడింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడా ఆయన పేరు వినపడలేదు. ఇప్పుడు వినపడేసరికి రాజకీయంగా కలకలకం ప్రారంభమైంది. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్యను కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తెలుగుదేశం పార్టీయే న్యాయం చేయాలని కోరారు.

స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక్కరే మొదటిసారిగా మాదిగలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని గుర్తించారని మంద కృష్ణమాదిగ అన్నారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబునాయుడు కూడా మాదిగలకు న్యాయం చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబువల్లే ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కాయని ఆయన అభిప్రాయపడ్డారు. వర్గీకరణ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందని, చంద్రబాబునాయుడు దీనిపై చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహానాడులో తీర్మానం చేయాలని, రాబోయే ఎన్నికల్లో మాల, మాది, రెల్లి ప్రజలకు 50 శాతం చొప్పున సీట్లు కేటాయించాలని కోరారు.












Click it and Unblock the Notifications