దేవినేని మృతి షాకింగ్, ఆ వార్త విని నోట మాట రాలేదు: మండలి బుద్ద ప్రసాద్
దేవినేని నెహ్రూ మరణ వార్త విని ఎలా స్పందించాలో అర్థం కాలేదని, నోట మాట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ మరణంతో బెజవాడలోని ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. దీంతో అనుచరులు, కుటుంబ సభ్యులంతా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలి వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ దేవినేని మృతిపై స్పందించారు. దేవినేని నెహ్రూ మరణ వార్త విని ఎలా స్పందించాలో అర్థం కాలేదని, నోట మాట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ మృతి తనను తీవ్రంగా బాధించిందని, వ్యక్తిగతంగా ఇది తనకు తీరని లోటని ఆవేదన చెందారు.

నెహ్రూ రాజకీయ గతాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయనలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బుద్దప్రసాద్ అన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాసరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు సంతాపం తెలిపారు.
కాగా, దేవినేని మృతదేహానికి మంగళవారం నాడు అంత్యక్రియలు నిర్వహిస్తామని అవినాష్ తెలిపారు. దేవినేని మృతితో పలువురు రాజకీయ ప్రముఖులు కేర్ ఆసుపత్రికి చేరకుంటున్నారు.












Click it and Unblock the Notifications