వైసీపీ నాయకులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు, సార్ టైమ్ కు వచ్చేయండి
వైసీసీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడులు చేశారని మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అనేక మంది వైసీపీ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే.
నందిగం సురేష్ ను విచారణ చేసి వివరాలు సేకరించడానికి కోర్టు అనుమతితో ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పలువురు వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ సైతం సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వైసీపీ నాయకులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి కూడా సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో విచారణకు హాజరుకావాలని వైసీపీ నాయకులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు సూచించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారని తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డిపై కేసు నమోదు అయ్యింది.
వైసీపీ నాయకులకు 41 ఏ నోటీసులు ఇచ్చిన పోలీసులు శనివారం మద్యాహ్నం విచారణకు హాజరుకావాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసిన తరువాత వైసీపీ నాయకులు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు పరుగు తీశారు. వైసీపీ నాయకులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు పోలీసులు విచారణకు పిలిచినప్పుడు వెళ్లాలని ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications