• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేక్ డిగ్రీ వివాదం-మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వివరణ-లోకేష్ చేయలేదా అంటూ విసుర్లు

|
Google Oneindia TeluguNews

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు నకిలీ డిగ్రీతో పదోన్నతి పొందారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి. అశోక్ బాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా టీడీపీ నేతలు ఇప్పుడు అధికార పార్టీ నేతల డిగ్రీల వివాదాలన్నీ తెరపైకి తెస్తున్నారు. ఇదే కోవలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్న నకిలీ డిగ్రీ వివాదాన్ని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇవాళ ట్వీట్ చేశారు.

తమ బాస్ జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని, దొంగ సర్టిఫికేట్లు, దొంగ విద్యార్హతలు పెట్టే వైసీపీలోని ఇంకొకడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటూ ఆయన ట్వీటే్ చేశారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో, 1993లో మైసూరు ఓపెన్ యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పొలిటికల్ సైన్సు పట్టాను పొందానని పెట్టాడని, సదరు విధ్యా సంస్థ స్థాపించిందే 96లో అయితే, దానికి 3 సంవత్సరాలకు ముందే రామకృష్ణారెడ్డికి సర్టిఫికేట్ లభించడం విశేషమంటూ బుద్ధా ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే 2019 అఫిడవిట్ కు వచ్చే సరికి, మాస్టర్స్ డిగ్రీ కాస్త డిప్లమా డిగ్రీ అయ్యిందన్నారు. ఇలాంటి దొంగ వేషాలు వేసే మీరు, ఏ తప్పు చేయని అశోక్ బాబు గారి పైన నిందలు వేయటమా ? అంటూ ప్రశ్నించారు. దీనికి ఆళ్ల వివరణ ఇచ్చారు.

mangalagiri ysrcp mla alla ramakrishnareddy reacts on tdps fake degree allegation, says its a mistake

తాను 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశానని, తన అసిస్టెంట్ పేరు కూడా రామకృష్ణారెడ్డేనని ఆళ్ల పేర్కొన్నారు. ఆయన ఇంటిపేరు మున్నంగి అన్నారు. తాను గతంలో మాస్టర్స్ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో ఒకే సంవత్సరం లో పూర్తిచేసేలా మైసూర్ ఓపెన్ యూనివర్సిటీ లేదా కర్ణాటక యూనివర్సిటీ (సరిగా గుర్తులేదు)కి అప్లై చేసి హైదరాబాద్ లోని అమీర్ పేట లో ఉన్న న్యూ సైన్స్ కాలేజీ లో ఎగ్జామ్స్ రాసినట్లు తెలిపారు.. రిజల్ట్ తెలుసుకునే సరికి తమ కంపెనీ లో కాంట్రాక్టులు వేరే రాష్ట్రాలలో వచ్చి పనిచేసుకోవటానికి వెళ్ళిపోయానన్నారు. ఇక రిజల్ట్స్ గురించి పట్టించుకోలేదన్నారు.. 2014 ఎన్నికల సమయం లో ఈ విషయం తన అసిస్టెంట్ కు చెప్పానన్నారు. చదివిన డిగ్రీ కోర్సులు కాదు, పూర్తి చేసిన కోర్సులు అఫిడవిట్ లో రాయాలి అని తెలియని తన అసిస్టెంట్ తాను పూర్తి చేసిన అఫిడవిట్ పై సంతకాలు తీసుకున్నాడని ఆళ్ల పేర్కొన్నారు.

2019 వచ్చేసరికి విషయం తెలుసుకుని తాను పూర్తి చేసిన ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లమోను అఫిడవిట్ లో రాశానన్నారు.
అయినా తానేమీ ప్రభుత్వ ఉద్యోగం మోసం చేసి చేయలేదని, పదోన్నతులు పొందలేదని ఆళ్ల తెలిపారు. అయినా 2019 ఎన్నికల్లో నారా లోకేష్ తన అఫిడవిట్ లో నోటరీ సంతకం తప్పుగా చేశారని, కరెక్ట్ గా చూస్తే ఆయన డమ్మీలేకుండా వేసిన ఆ అఫిడవిట్ చెల్లకుండా పోయేదని ఆళ్ల పేర్కొన్నారు. లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులు అయ్యేవాడని గుర్తుచేశారు. కానీ వ్యవస్థలు మేనేజ్ చేసిన చంద్రబాబు, లోకేష్, ఈ విషయంలో గుండె మీద చేయివేసి చెప్పాలనన్నారు. లోకేష్ నామినేషన్ చెల్లేదా, కాదా అని. అంటే ఎవరో పూర్తి చేసిన అఫిడవిట్ లోకేష్ ఓ నమ్మకంతో సంతకం చేశారని చెప్పారన్నారు. అలాగే తానూ 2014లో అఫిడవిట్ పై సంతకం చేశానని గుర్తుచేశారు. అయినా ఇప్పుడు అశోక్ బాబు తప్పు చేశారా లేదా అని చెప్పకుండా...తనపై ఎదురుదాడి చేయడం ప్రజలకు అర్ధమైందన్నారు.

English summary
mangalagiri ysrcp mla alla ramakrishnareddy on today reacted on opposition tdp's fake degree allegation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X