సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా మనోజ్ శశిధర్

హైదరాబాద్: సీబీఐ జాయింట్ డైరెక్టర్(జేడీ)గా ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నియమితులయ్యారు. ఆయన 1994 గుజరాత్ కేడర్ అధికారి. సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్ ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది ఇలావుంటే, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సీబీఐ జేడీ నియామకంపై కేంద్ర హోంశాఖకు ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. 'విజయసాయి రెడ్డి తన లేఖలో ప్రస్తావించిన వివరాలిలా ఉన్నాయి. ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌లో సీబీఐ జేడీ నియమించాలి. చట్టప్రకారం నడుచుకునే వ్యక్తిని దేశ ప్రయోజనాల రీత్యా నియమించాలి. గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ మాజీ సీఎం చంద్రబాబు నాయడుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు'

 Manoj Shashidhar as CBI new joint director

వైయస్ జగన్‌ను ఇబ్బందులు సృష్టించేందుకు 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు నాయుడు నాటి జేడీ లక్ష్మీనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా అనేక సార్లు లక్ష్మినారాయణ.. చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు సృష్టించారు. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన, రాజకీయాలపై సీబీఐలో అంతర్గత విచారణ సైతం జరిగింది.

లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీతో వ్యూహాత్మక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తి, రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన తల్లిదండ్రుల అంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. లక్ష్మీనారాయణతో పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీ ఉన్న కాలంలో ఎస్పీగా పని చేశారు.

చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకొని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో జరిగిన భారీ అవినీతి నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసం తన అధికారులను సీబీఐ హైదరాబాద్‌లోకి నియమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ సీబీఐ జేడీగా నియామకాలు దురుద్దేశ పూర్వకంగా, రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలి అని కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో విజయసాయి రెడ్డి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+