ఏపీలో ఘోర రైలు ప్రమాదం: 39 మంది మృతి, ఇవీ హెల్ప్‌లైన్ నెంబర్లు

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు స్టేషన్ సమీపంలో రాయగఢ్‌ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది.

విజయనగరం: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు స్టేషన్ సమీపంలో రాయగఢ్‌ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. ఆ తర్వాత మరో 16 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 39కు పెరిగింది.

Many dead as Jagdalpur-Bhubaneswar Express derails at AP

ఈ ప్రమాదంలో ఏడు బోగీలు పడిపోయాయి. ఇందులో ఒక ఏసీ, నాలుగు జనరల్‌, రెండు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, యాభై మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

శనివారం రాత్రి హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వెళ్తోంది. ప్రయాణీకులు నిద్రలో ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా కుదుపు చోటు చేసుకుంది. కళ్లు తెరిచి, ఏం జరిగిందో తెలిసేలోగా ప్రమాదం చోటు చేసుకుంది.

Many dead as Jagdalpur-Bhubaneswar Express derails at AP

ప్రమాదం జరిగిన చోట హాహాకారాలు. దీంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. తమ వారి కోసం ఇతర ప్రయాణీకులు వెతుకుతున్నారు. తాము ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పిందని తెలుసుకునేందుకు రైల్లో ఉన్న వారికి కాస్త సమయం పట్టింది. వెంటనే వారు షాకయ్యారు. బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి.

విషయం తెలియగానే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.బోగీలను విడిగా చేసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. గాయపడ్డ వారిని పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. విశాఖ నుంచి హుటాహుటిన సహాయక బృందం బయలుదేరింది.

Many dead as Jagdalpur-Bhubaneswar Express derails at AP

డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ సహా 18 మంది రైల్వే అధికారులు, 8 మంది వైద్యులు ప్రమాద ప్రాంతానికి వెళ్లారు. రాయగఢ్‌ కలెక్టర్‌, జేసీ, విజయనగరం ఓఎస్‌డీ తదితరులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

నాలుగు సహాయక బృంద వ్యాన్లు సంఘటన స్థలానికి వెంటనే తరలినట్లు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ప్రకటించింది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Many dead as Jagdalpur-Bhubaneswar Express derails at AP

మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హెల్ప్ నెంబర్లు

మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హెల్ప్ నెంబర్లను తెలియజేసింది. ఖుద్రా కంట్రోల్ రూం: 0674 2490670. భువనేశ్వర్ స్టేషన్: 06742543360. బెహ్రంపూర్ స్టేషన్ :06802229632.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+