BSNL బంపర్ ఆఫర్.. రూ.259కే 700 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్... ఫ్రీ ఓటీటీ !!

భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ... బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను టార్గెట్ గా చేసుకొని కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను ప్రకటించింది. కేవలం నెలకు రూ.259కే 700 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత OTT అందిస్తుంది. భారత్‌నెట్ ప్రాజెక్టు, డిజిటల్ భారత్ నిధి కలయికలో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించాలనే ఉద్దేశంతో ఈ భారీ ఆఫర్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఓ పక్క ప్రైవేట్ టెలికాం కంపెనీలు వరుసగా టారిఫ్ ధరలను పెంచుతున్న సమయంలో ఈ రకంగా అదిరిపోయే ఆఫర్ ఇవ్వడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

700GB డేటా..

ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు 700GB వరకు పూర్తి వేగంతో డేటా ఉపయోగించుకోవచ్చు. ఆ పరిమితి దాటిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవ కొనసాగుతుంది. అయితే స్పీడ్ 2 Mbpsకు తగ్గుతుంది. వాటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు మాత్రం ఉండవు. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, వీడియో స్ట్రీమింగ్ వంటి వాటికి ఇది సంపూర్తిగా సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.

bsnl-new-recharge-offer-that-700-gb-data-and-unlimited-calls-with-free-ott-subscription-only-for-259

అపరిమిత కాల్స్..

అలానే ఈ ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కొత్త కనెక్షన్ తీసుకునే వారికి ఉచిత ఇన్‌స్టాలేషన్ తో పాటు మోడెమ్ కూడా ఫ్రీ గా అందజేస్తున్నట్లు BSNL తెలిపింది.

ఫ్రీ OTT..

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పాటు Waves OTT ప్లాట్‌ఫామ్‌కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇందులో సినిమాలు, టీవీ షోలు, ఇతర వినోద కార్యక్రమాలను అదనపు చార్జీలు లేకుండా వీక్షించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+