విజయవాడ, రాజమండ్రి ప్రజలకు కేంద్రం ముఖ్య సూచన
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు జరుగుతుండటంతో ఏపీమీదగా నడిచే కొన్ని రైళ్లను రద్దుచేశారు. మరికొన్నింటిని దారిమళ్లించి తిప్పుతున్నారు.
18వ తేదీ నుంచి 31 వరకు
మచిలీపట్నం-విశాఖపట్నం (17219/17220), విజయవాడ-విశాఖపట్నం (22702/22701), బిట్రగుంట-విజయవాడ (07977/07978),
బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ-తెనాలి (07279/07575), విజయవాడ-ఒంగోలు (07576/07500),
విజయవాడ-గూడూరు (12744/12743), గుంటూరు-విశాఖపట్నం (17239/17240) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

18వ తేదీ నుంచి 31 వరకు పాక్షికంగా రద్దైన రైళ్లు
మచిలీపట్నం-విజయవాడ (07896/07769), విజయవాడ-మచిలీపట్నం (07866/07770), నర్సాపూర్-విజయవాడ (07863),
విజయవాడ-భీమవరం టౌన్ (07283), విజయవాడ-నర్సాపూర్ (07861), మచిలీపట్నం-విజయవాడ (07870) రైళ్లు రామవరప్పాడు-విజయవాడ మధ్య రద్దు అయ్యాయి.
దారి మళ్లించిన రైళ్ల వివరాలు
18వ తేదీ నుంచి 25 వరకు ఎర్నాకుళం-పాట్నా (22643)
23 నుంచి 30 వరకు భావ్‌నగర్-కాకినాడ పోర్టు (12756)
20, 22, 27, 29 తేదీల్లో బెంగళూరు-గౌహతి (12509),
18, 20, 22, 23, 25, 27, 29, 30 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్-భువనేశ్వర్ (11019),
18 నుంచి 31 వరకు ధన్‌బాద్-అలెప్పి (13351),
23, 30 తేదీల్లో హతియా-బెంగళూరు (18637),
19, 24, 26, 31 తేదీల్లో హతియా-బెంగళూరు (12835),
22, 29 తేదీల్లో టాటా-బెంగళూరు (12889),
21, 28 తేదీల్లో టాటా-యశ్వంత్‌పూర్ (18111),
18, 25 తేదీల్లో హతియా-యర్నాకులం (22837) రైళ్లను విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.












Click it and Unblock the Notifications