'త్వరలో పెద్ద ఎత్తున జగన్ పార్టీ నుండి టీడీపీలోకి నేతలు'

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి త్వరలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వలసలు వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకే దీక్ష చేపడుతున్నారన్నారు.

సాగునీటి స్వరూపాన్ని మారుస్తా: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి స్వరూపాన్ని మార్చలనుకుంటున్నాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో అన్నారు. ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకునేలా మాస్టర్ ప్లాన్‌ రూపొందించాలని, వచ్చే బడ్జెట్‌లో సాగునీటి రంగానికే అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.

Many YSR Congress Party leaders into TDP soon: atchannaidu

కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నదుల అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా - గోదావరి, గోదావరి - పెన్నా నదుల అనుసంధానంపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

అనాలోచిత నిర్ణయం: నాగం

ఛాతి ఆసుపత్రి మార్పు పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకున్న నిర్ణయం అనాలోచితమని భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆసుపత్రుల స్థానంలో ఆకాశహర్మ్యాల అవసరం ఏమిటని ప్రశ్నించారు.

నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించండి: రాజయ్య

తన పైన వచ్చిన అవినీతి ఆరోపణల పైన విచారణ జరిపించాలని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య అన్నారు. దోషిగా నిర్ధారణ అయితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+