మావో బంద్: ఏవోబీలో టెన్షన్, టి, ఏపీల్లో హై అలర్ట్, విస్తృత తనిఖీలు

విశాఖపట్నం: మావోయిస్టులు గురువారం(నవంబర్ 3న) బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయనగరం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులను పూర్తిగా నిలిపివేశారు. వ్యాపార, విద్యా సంస్థలు కూడా మూసివేశారు. కాగా, మావో ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు.. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నవంబర్ 3న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాల బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడవచ్చనే అనుమానంతో ఈ ఐదు రాష్ట్రాల్లోని పోలీసులూ అప్రమత్తమయ్యారు.

Maoist bandh: Tension in AOB

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ పోలీసులు.. మావో ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మోహరించి విస్తృత తనఖీలు చేపడుతున్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రత పెంచారు. సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవద్దని సూచించారు.

తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం- ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లోనూ హైఅలర్డ్ ప్రకటించారు. భారీగా మోహరించిన పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా బంద్ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+