నేటి నుంచి జూన్‌ 2వ తేదీ వరకు...బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

విశాఖపట్టణం: ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛతీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో నేటి నుంచి జూన్‌ 2వ తేదీ వరకు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. గతనెల గడ్డిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసన ప్రకటిస్తూ వాల్ పోస్టర్లు విడుదల చేశారు. మావోల బంద్‌తో ఆయా రాష్ట్రాల్లో పొలీసులు అప్రమత్తమయ్యారు.

బంద్ తో పాటు బిజెపి నేతలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. మావోలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్,తనిఖీలు చేపట్టారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల మావోయిస్ట్ లతో ఎదురు కాల్పులు జరిగిన ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ లో జల్లెడ పట్టాలని నిర్ణయించారు.

 Maoists call for bandh from today to june 2 in four states to protest against encounters

ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌లు,మహారాష్ట్రలో తగిలిన రెండు భారీ దెబ్బలతో మావోయిస్టు పార్టీ అప్రమత్తంగా ఉన్నట్లు ఇటీవలి కొన్ని ఘటనలను బట్టి అర్థం అవుతోంది. అయితే ఎక్కడైనా ప్రతీకార దాడులకు దిగే అవకాశముందన్న అనుమానం, వేసవిలో ఉండే అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసు బలగాలు కూంబింగ్‌ విస్తృతంగా చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ లు బంద్ కు పిలుపు నివ్వడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మావోయిస్ట్ లను బలంగా అణచివేసేందుకు కార్యోన్ముఖులవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+