'మీడియా ముసుగులో చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేసే అవకాశం'
మీడియా ముసుగులో చంద్రబాబుపై మావోయిస్టులు దాడికి దిగే అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టుగా ఢిల్లీ పోలీసుల నిఘాలో తేలింది. సీఎం కదలికలపై ఓ కన్నేసి ఉంచిన మావోయిస్టులు ఇప్పటికే ఆయన కదలికలపై ఆరుసార్లు రెక్కీ నిర్వహించారని తేలడం విస్మయానికి గురిచేస్తోంది. పలు టీవీ చానెళ్లు ఈ వార్తను ప్రసారం చేశాయి.
చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్బంగా.. ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారని ఢిల్లీ పోలీసులు తేల్చారు.ఇప్పటికే పలుమార్లు ఏపీ భవన్ పరిసరాల్లో మావోయిస్టులు రెక్కీ చేసి వెళ్లినట్టుగా నిఘాలో బయటపడింది.
ముఖ్యంగా మీడియా ముసుగులో చంద్రబాబుపై మావోయిస్టులు దాడికి దిగే అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఏపీ భవన్ లో భద్రతా లోపలున్నాయని, ఈ విషయంపై ఎన్నిసార్లు అక్కడి అధికారులను హెచ్చరించినా లాభం లేకపోయిందని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే రెక్కీలో ఎంతమంది పాల్గొన్నారన్న దానిపై విచారణ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఏపీ భవన్ అధికారులకు ఇదే తమ చివరి హెచ్చరిక అని.. ఇకనైనా సీఎం భద్రత విషయంలో పకడ్బందీగా ఉండాలని ఢిల్లీ పోలీసులు తెగేసి చెప్పినట్టు సమాచారం.
కాగా, ఇంటలిజెన్స్ హెచ్చరికలతో.. ఏపీ భవన్ లో భద్రతా డొల్ల బయటపడుతుంది. ముఖ్యంగా . ఎవరు మీడియా ప్రతినిధులు, ఎవరు కాదు అని తెలుసుకునే నిఘా వ్యవస్థ ఏది ఇక్కడ లేదు. పలువురు ఐఏఎస్ లు, ఓఎస్డీలు పెద్ద సంఖ్యలో ఏపీ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ప్పటికీ.. భద్రతా విషయంలో వారంతా అలసత్వంతోనే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటలిజెన్స్ హెచ్చరికపై డీజీపీ స్పందన:
ఏవోబీ ఎన్ కౌంటర్ కు ప్రతీకారకంగా సీఎం చంద్రబాబు దాడి జరగవచ్చనే జనరల్ అలర్ట్ మాత్రమే తమకు ఉందన్నారు డీజీపీ సాంబశివరావు. మావోయిస్టులు రెక్కీ నిర్వహించడంపై తమకెలాంటి సమాచారం లేదన్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు అలిపిరి ఘటనను కూడా ఉదహరించినట్టుగా డీజీపీ తెలిపారు. ప్రస్తుతం సీఎం భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications