13 మంది సజీవ దహనం, మార్కాపురంలో మృత్యుఘోష..

మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామునే పెను విషాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మంటలకు ఆహుతయ్యారు. హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను అత్యంత వేగంతో ఢీకొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.

ఉదయం 6 గంటల నుంచి 6:30 గంటల మధ్య బస్సు పలకల క్వారీల మలుపు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సుతో పాటు టిప్పర్‌లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. వెనుక సీట్లలో ఉన్నవారు మంటల ధాటికి బయటకు రాలేక బస్సులోనే కాలి బూడిదయ్యారు.

Markapuram Ten Passengers Perish in Massive Bus Inferno After High-Speed Tipper Collision

అతివేగమే శాపమా?

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. టిప్పర్ డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. క్వారీల మలుపు వద్ద వేగాన్ని నియంత్రించలేక నేరుగా టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయి కేవలం ఇనుప అస్థిపంజరంలా మిగిలిపోయింది.

సహాయక చర్యలు ముమ్మరం..

మృతుల్లో ఎక్కువమంది కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం. ప్రమాద వార్త తెలియగానే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే బస్సు, టిప్పర్ పూర్తిగా అస్థిపంజరాల్లా మారిపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం దిగ్భ్రాంతి

ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+