వివాహిత మృతి: అనుమానంతో భర్తే కొట్టి చంపాడా?
కడప: కడప జిల్లా కమలాపురం మండలంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. కమలాపురం మండలంలోని సంబటూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే వివాహతి మంగళవారం రాత్రి అనుమానాస్పద స్తితిలో మరణించింది.
అయితే, ఇంట్లో దులిపేందుకు కుర్చీపైపైకి ఎక్కగా అదుపు పడిపోయిందని, తలకు గాయం కావడంతో చనిపోయిందని భర్త చెన్రాయుడు చెబుతున్నాడు. కానీ చెన్రాయుడు భార్యను అనుమానించేవాడని, దాంతో కొట్టి చంపాడని తల్లి ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమె బుధవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష్మీదేవి (30) దంపతులకు కుమారుడు (9), కూతురు (5) ఉన్నారు.

ఎర్రచందనం దుంగల స్వాధీనం
చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద రూ.3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పుత్తూరు చెక్‌పోస్టు వద్ద మంగళవారం అర్థరాత్రి అటవీ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఓ టాటా ఇండికా కారు ఆగకుండా వెళ్లిపోయింది. దాంతో అధికారులు కారును వెంబడించారు.
అయితే, పరమేశ్వర మంగళం వద్ద కారును స్మగ్లర్లు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో కారు సహా అందులోని రూ. 3 లక్షల విలువైన 10 ఏర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజీ అధికారి రెడ్డప్ప చెప్పారు.












Click it and Unblock the Notifications