మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు: తప్పిన ప్రమాదం

Subscribe to Oneindia Telugu

కృష్ణా: మచిలీపట్నం-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి వద్దకు రాగానే రైలు ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్‌ స్టేషన్ వద్ద రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఉంగుటూరు పోలీసులు దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంక్ సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

Massive fire breaks out in Machilipatnam express

ఎంతకు మంటలు అదుపులోకి రాకపోవడంతో గన్నవరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A major fire broke out in the Machilipatnam express engine on Friday night causing a tense situation. However, the fire was immediately doused.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి