తిరుమల వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు TTD గుడ్ న్యూస్..!!

Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి భక్తులకు ముందస్తుగానే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. ఇందు కోసం భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 18.9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ కు సమయం నిర్దేశించారు. కాగా, సామాన్య భక్తులకు దర్శనం విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ దర్శనం కల్పించేలా కార్యాచరణ ఖరారు చేింది.

శ్రీవారి ఆలయంలో డిసెంబర్‌ 30 నుంచి జనవరి 8 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా టీటీడీ చర్యలు చేపట్టింది. డిసెంబర్‌ 30, 31, జనవరి 1 దర్శనాలకు ఆన్‌లైన్‌లో ముందస్తుగా భక్తులు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో.. భక్తుల నుంచి భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. వీరికి లక్కీ డిప్ ద్వారా దర్శన టోకెన్లు కేటాయించనున్నారు. జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2 ద్వారా నేరుగా సర్వ దర్శనం అమలు చేయనున్నారు. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా క్యూలైన్‌లో ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగానూ ఎలాంటి టోకెన్లూ జారీ చేయరు.

massive-response-to-vaikunta-dwara-darshan-registrations-details-here

కాగా, https://ttdevasthanams.ap.gov.in/home/dashboard ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించిన టీటీడీ ttps://apps.apple.com/in/app/ttdevasthanams/mobileapp ద్వారా ఈ-డిప్‌నకు నమోదు చేసుకొనే అవకాశం కల్పించింది. దీని ద్వారా వన్‌ ప్లస్‌ 3 కింద ప్రతి వ్యక్తి నమోదు చేసుకునే అవకాశం ఉంది. తెలుగు, ఇంగ్లీష్​, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 2న డిప్‌లో ఎంపిక అయిన వారికి దర్శన సమాచారం పంపిస్తారు. ఇక..వాట్సప్‌ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్‌ డిప్‌ రిజిస్ట్రేషన్‌ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్‌ నంబర్​ 9552300009కు ముందుగా హాయ్‌ లేదా గోవిందా అని మెసేజ్‌ చేయాలి. అనంతరం మీరు మీ భాషను ఎంపిక చేసుకుని తెలుగు కోసం టీఈ, ఇంగ్లిష్‌ కోసం ఈఎన్ అని రిప్లై ఇవ్వాలి. అనంతరం సర్వీసెస్‌ విండో ద్వారా టీటీడీ టెంపుల్‌ విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి. తరువాత వైకుంఠ ద్వార దర్శనం (డిప్‌) రిజిస్ట్రేషన్‌ అప్షన్‌ వస్తుంది.

భక్తులు భాషను ఖరారు చేసి తరువాత మీ చిరునామా, పిన్‌కోడ్‌ వివరాలు నమోదు చేయాలి. దర్శనం తేదీని ఎంపిక చేసుకుని ఆధార్‌ కార్డులో ఉన్న విధంగా పేరు, వయసు, జెండర్, ఆధార్, మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి. అంతే సబ్మిట్‌ చేస్తే సరిపోతుంది. ఒక మొబైల్‌ నంబర్, ఆధార్‌ ర్డు ద్వారా కేవలం ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా, జనవరి 2 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌లో రోజువారీగా 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లు, రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లను రెగ్యులర్‌ పద్ధతిలో కేటాంచనున్నారు. డిసెంబర్‌ 5 ఉదయం 10 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 (ఎస్‌ఈడీ) కోటాను ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేయనున్నారు. జనవరి 6,7,8 తేదీల్లో స్థానికులకు బుక్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట స్థానికులకు రోజూ 4500, తిరుమల వాసులకు 500 టోకెన్లను జారీ చేయనున్నారు. వీరికి డిసెంబర్‌ 10న టోకెన్లను విడుదల చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+