వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ బాల్ పట్టి ఏం చేస్తారు? జగన్ సభకు రారు: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: ఆట అయిపోయిక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాల్ పట్టుకుంటానంటున్నారని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సోమవారం విమర్శించారు. సిడబ్ల్యూసి నిర్ణయం కంటే ముందే ముఖ్యమంత్రి తాను సమైక్యవాదిని అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయం జరిగిపోయిందని, ఇంకా జరగలేదంటూ సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దన్నారు.

కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి లాంటి వారు బయటకు వచ్చారని, అలాగే అందరు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలన్నారు. నాడు జవహర్ లాల్ నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు ఆ కుటుంబం దేశానికి సేవ చేసే కుటుంబమన్నారు. అవినీతికి పాల్పడి దోచుకునే కుటుంబం కాదని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి పదవి అవకాశం రెండుసార్లు వచ్చినప్పటికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నో చెప్పారన్నారు.

రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమని కేంద్రం రోడ్డు మ్యాప్ అడిగినప్పుడు కిరణ్ చెప్పాల్సిందన్నారు. దేశవ్యాప్తంగా సర్వేలు చేయించే వ్యక్తి విజయవాడలో తన సామర్థ్యంపై సర్వే చేయించుకోవాలని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ను ఉద్దేశించి అన్నారు.

ఆఖరి అస్త్రం తమ చేతిలో ఉందని పలువురు సీమాంధ్ర నేతలు అంటున్నారని, మ్యాచ్ అయిపోయిన తర్వాత చేతిలో బంతి పట్టుకొని ఏం చేస్తారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమన్నారు.

హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ జరిగితే తెలంగాణ ప్రాంతం నుండి పదిమంది రారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.

English summary

 Congress Party senior MP V Hanumantha Rao on Monday said What will CM Kiran Kumar Reddy do with ball.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X