ఆ రోజు ఏపీకి సెలవు.. ఉత్తర్వుల జారీ
ఏపీ అసెంబ్లీకి, లోక్ సభకు ఒకేరోజు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. మే 13వ తేదీన పోలింగ్ జరగనుండా జూన్ నాలుగోతేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. మే 13వ తేదీన ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి జారీచేశారు. రాష్ట్రంలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కార్మిక శాఖ కూడా వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. అలాగే ఫ్యాక్టరీలు, షాపులు, ప్రజాప్రాతినిధ్య చట్టం, సముదాయాల చట్టం కింద కూడా సెలవును ప్రకటించారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత గురించి చీఫ్ సెక్రటరీ డీజీపీ, సీఈవోతో సమావేశం నిర్వహించారు. ఇందులో వివిధ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజన్సీల అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో 4.09 కోట్ల ఓటర్లున్నట్లు సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందికి, పోలింగ్ సిబ్బందికి, రిటర్నింగ్ అధికారులకు, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి, సెక్టోరల్ అధికారులు.. ఇలా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది మొత్తానికి ఎన్ని వాహనాలు అవసరమవుతాయి అనే విషయంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయబోతున్నట్లు డీజీపీ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల బందోబస్తుకు 1.50 లక్షల రాష్ట్ర పోలీసులు, స్టేట్ ఆర్మ్ డ్ రిజర్వుడు పోలీసులు, సెంట్రల్ ఆర్మ్ డ్ రిజర్వుడు పోలీసులతోపాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి హోంగార్డులతోపాటు ఇతర స్థాయిల్లో ఉండే పోలీసులను కూడా నియమించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications