కేవీపీ బిల్లు: విజయసాయితో చంద్రబాబుకు మోడీ చెక్, జగన్‌కు షాక్!

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు మెంబర్ బిల్లు పైన బిజెపి, టిడిపిలు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ సమావేశాల్లో కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లుతో పాటు తెలుగుదేశం పార్టీకి మరో ఇబ్బంది కూడా ఉంది. అదే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఫిరాయింపుల పైన చేయనున్న డిమాండ్.

ఈ రెండు కూడా బీజేపీ-టిడిపి మిత్రపక్షాన్ని ఇరుకున పడేసే అంశాలేనని అంటున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా బిల్లు ఇరు పార్టీల మధ్య దూరం పెంచే విషయం కాగా, పిరాయింపుల అంశం టిడిపితో పాటు బీజేపీకి చిక్కులు తెచ్చేది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి వ్యూహాత్మకంగా ముందుకు సాగాయని అంటున్నారు.

మోడీ, బాబులకు చిక్కులు

మోడీ, బాబులకు చిక్కులు

ఇప్పుడు కేవీపీ బిల్లు, రేపు విజయ సాయి లేవనెత్తే పార్టీ పిరాయింపుల అంశం ఇటు మోడీకి, అటు చంద్రబాబుకు చిక్కులు తెచ్చి పెట్టే అంశం.

కేవీపీ బిల్లు

కేవీపీ బిల్లు

ప్రత్యేక హోదా విషయంలో చర్చ, ఓటింగ్ జరిగితే అటో ఇటో టిడిపి మద్దతివ్వడం ద్వారా తప్పించుకుంటుంది. బీజేపీకి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏపీలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా కేవీపీ బిల్లుకు తాము మద్దతివ్వక తప్పలేదని టిడిపి.. బీజేపీకి సర్ది చెప్పుకునే అవకాశముంది.

విజయ సాయి రెడ్డి

విజయ సాయి రెడ్డి

కానీ, ఆ తర్వాత విజయ సాయి పెట్టే లేవనెత్తే ఫిరాయింపుల అంశం చంద్రబాబును మరింత ఇరుకున పడేసే అవకాశముంది. దానిని చూపించి.. ఇప్పుడు బీజేపీ టిడిపిని దారిలోకి తెచ్చుకొని ఉండవచ్చునని అంటున్నారు.

రాజ్యసభ

రాజ్యసభ

అందుకే, కేవీపీ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించిన టిడిపి.. దాని పైన వెనక్కి తగ్గకుండా, అదే మాట చెబుతూనే, రాజ్యసభ వాయిదా విషయంలో కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతోందని అంటున్నారు. అందులో బీజేపీ తప్పు లేదని చెబుతోంది. తద్వారా బీజేపీని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఫిరాయింపుల అంశం బీజేపీకి కూడా ఇబ్బందే. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందనే అపవాదు ఉంది. కానీ రాష్ట్రం విషయానికి వస్తే అది బీజేపీ కంటే టీడీపీ పైనే ప్రభావం పడుతుంది. జగన్.. చంద్రబాబు పైన ఎక్కుపెడుదామనుకున్న పిరాయింపుల అస్త్రంతో బీజేపీ.. టిడిపి తమ దారిలోకి తెచ్చుకొని ఉంటుందని అంటున్నారు. మొత్తంగా, ఫిరాయింపుల అంశంతో చంద్రబాబును ఇరుకున పెట్టాలనుకున్న జగన్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
May BJP versus Telugudesam in Rajya Sabha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి