బెజవాడ టీడీపీలో చిచ్చు: తిరుగుబాటు, బాబుపై ఒత్తిడి! మేయర్ ఏం చెప్పారంటే..

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్‌లో అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నగర మేయర్ కోనేరు శ్రీధర్‌పై సొంత పార్టీ కార్పోరేటర్లు, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఉండవల్లి ఎఫెక్ట్, చంద్రబాబుకు 'ఆ' షాక్: పవన్ కళ్యాణ్ లేకున్నా.. టీడీపీ తీవ్ర అగ్రహం

పలువురు కార్పోరేటర్లు తిరుగుబాటు చేశారు. ఈ మేరకు పలువురు కార్పోరేటర్లు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తాను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.

చదవండి: మీకు మాకు కాదు: బీజేపీతో కొట్లాటపై టీడీపీ ట్విస్ట్, మోడీపై యుద్ధమే: గల్లా జయదేవ్ ఘాటుగా

ఏ తప్పూ చేయలేదని కోనేరు శ్రీధర్

ఏ తప్పూ చేయలేదని కోనేరు శ్రీధర్

కార్పోరేటర్ల తిరుగుబాటుపై మేయర్ కోనేరు శ్రీధర్ స్పందించారు. కొందరు కార్పోరేటర్లు మేయర్ పదవిపై వ్యామోహంతో తిరుగుబాటు చేస్తున్నారని వాపోయారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.

తప్పుడు ఫిర్యాదులు, గద్దెతో విభేదాల్లేవు

తప్పుడు ఫిర్యాదులు, గద్దెతో విభేదాల్లేవు

తన పైన తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని కోనేరు శ్రీధర్ వాపోయారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ నగర పరిధిలో రూ. కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

అభివృద్ధి పనులు కేటాయించాలని

అభివృద్ధి పనులు కేటాయించాలని

ఆ అభివృద్ధి పనుల్లో కొన్ని కేటాయించాలని కొందరు అడుగుతున్నారని కోనేరు శ్రీధర్ వెల్లడించారు. మేయర్ కావాలని, పనులు కేటాయించాలనే డిమాండుతో కొందరు తనను టార్గ్ చేసుకున్నారని వాపోయారు.

బాబు ఆదేశిస్తే రాజీనామా

బాబు ఆదేశిస్తే రాజీనామా

కాగా, ఇటీవల కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ... చంద్రబాబు ఆదేశిస్తే ఇప్పుడే తన పదవికి రాజీనామా చేస్తానని, తనపై కొందరు పార్టీలోని వారు బురద జల్లుతున్నారని, చంద్రబాబు వద్దకు వెళ్లి పదవుల పంచాయతీ పెట్టుకోవచ్చునని కార్పోరేటర్లకు, నేతలకు సూచించారు.

తొలి నుంచి పొసగడం లేదు

తొలి నుంచి పొసగడం లేదు

కోనేరు శ్రీధర్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సొంత పార్టీ కార్పోరేటర్లకు, కొందరు నేతలకు, ఆయనకు మధ్య పొసగడం లేదు. ఆయనపై చంద్రబాబుకు పలువురు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. కోనేరును మార్చాలని వారు అధినేతకు చెప్పారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు వద్దకు గొడవ వెళ్తోంది. కోనేరును మార్చాలని పలువురు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mayor Koneru Sridhar verus Corporators in Vijayawada Telugudesam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి