రైల్వే ప్రయాణికులకు శుభవార్త: విజయవాడ, రాజమండ్రి రైల్వేస్టేషన్లలో 20 రూపాయలకే భోజనం!!

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం వేసవిలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రయాణికుల సౌకర్యాలను కూడా మెరుగుపరిచే విధంగా కూడా రైల్వే చర్యలను చేపడుతుంది. ముఖ్యంగా విజయవాడ రైల్వే జంక్షన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం ఐఆర్ సిటీసి స్పెషల్ భోజనం కౌంటర్ ను అందుబాటులోకి తెచ్చింది. రాజమండ్రిలో కూడా కౌంటర్ పెట్టింది. దేశవ్యాప్తంగా అనేక స్టేషన్లలోనూ ఈ కౌంటర్స్ ఏర్పాటు చేసింది.

ఎకానమీ మీల్స్ పేరుతో 20 రూపాయలకే నాణ్యమైన భోజనం
కేవలం 20 రూపాయలకే భోజనాన్ని అందిస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయడం సామాన్య, మధ్యతరగతి రైల్వే ప్రయాణికులకు ఉపయుక్తంగా మారింది. ప్రయాణికులకు ఎకానమీ మీల్స్ పేరుతో 20 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందుబాటులోకి తెచ్చింది irctc. దీనికోసం రైల్వేస్టేషన్లో జనరల్ బోగీలు ఆగే చోట కౌంటర్ ను ఏర్పాటు చేశారు.

Meal for 20 rupees IRCTC economy meal counters in Vijayawada and Rajahmundry railway stations

జనరల్ బోగిలలో ప్రయాణం చేసే సామాన్య మధ్యతరగతి ప్రయాణికుల కోసం
20 రూపాయలకు ఎకానమీ మీల్స్, 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అందిస్తున్నారు. వేసవికాలంలో ప్రయాణం చేస్తున్న వారికి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో ఐఆర్ సీటీసి తో కలిసి ఈ ఏర్పాట్లు చేసినట్టుగా రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక ఈ కౌంటర్ ఏర్పాటు వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జనరల్ బోగిలలో ప్రయాణం చేసే సామాన్య మధ్యతరగతి ప్రయాణికుల ఆకలి తీర్చడం.

విజయవాడతో పాటు రాజమండ్రి రైల్వే స్టేషన్ లోనూ కౌంటర్
వేసవి పూర్తయ్యే వరకు ఈ కౌంటర్ ను నిర్వహిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి విజయవాడ తో పాటుగా ఇలాంటి కౌంటర్లను రాజమండ్రి రైల్వే స్టేషన్లో కూడా ఏర్పాటు చేసినట్లు డిఆర్ఎం నరేంద్ర ఆనంద్ రావు పాటిల్ వెల్లడించారు. అయితే ఈ కౌంటర్లలో భోజనం కొనుగోలు చేసుకుంటున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈ కౌంటర్ ఏర్పాటుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కౌంటర్ లపై ప్రయాణికుల అభిప్రాయం ఇదే
ఇలాంటి కౌంటర్లు మరిన్ని ఏర్పాటు చేయాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. ఒక్క వేసవిలో మాత్రమే కాకుండా అన్ని కాలాలలోనూ ప్రయాణికుల సౌకర్యార్థం ఇలాంటి కౌంటర్లు ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినా నాణ్యమైన భోజనం దొరకటం లేదని, ఇలాంటి కౌంటర్ల ద్వారా నాణ్యమైన భోజనం అందించాలని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+