బెజవాడ వరద బాధితులకు బంపర్ ఆఫర్-ఇంటివద్దకే మెకానిక్ లు..!
బెజవాడలో వచ్చిన భారీ వరదల ప్రభావం వాహనాలపైనా తీవ్రంగా పడింది. భారీ సంఖ్యలో వరద బాధితుల వాహనాలు వరదల్లో చిక్కుకుపోయాయి. ఇళ్లలోకి ప్రవేశించిన వరదతో వాహనాలు కూడా నీట మునిగాయి. దీంతో చాలా వాహనాలు రిపేర్లు వచ్చేశాయి. వీటిని ఇంటి వద్ద నుంచి గ్యారేజ్ లకు తరలించే పరిస్ధితి లేదు. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకుంది. తాజాగా మెకానిక్ లను వరద బాథితుల ఇంటి వద్దకే పంపి సర్వీస్ చేయిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమల్లోకి వచ్చింది.
నగరంలోని సింగ్ నగర్ తో పాటు వాంబే కాలనీ, జక్కంపూడి, రాజరాజేశ్వరి పేటలో వరద బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వాహనాల సర్వీసింగ్ చేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి మెకానిక్ లు ప్రారంభించారు. దీంతో బాధితులకు కాస్త ఊరట లభించినట్లయింది. ముఖ్యంగా ఇళ్ల వద్ద నుంచి వాహనాలను గ్యారేజ్ లకు తీసుకెళ్లలేక, అలాగని బయటికి కదల్లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం పంపిన మెకానిక్ లు ఇవాళ్టి నుంచి రిపేర్లు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు.

నగరంలో ఉన్న మెకానిక్ లను వరద ప్రాంతాలకు పంపే ప్రక్రియను అధికారులు చేపట్టారు. పెయిడ్ సర్వీసే అయినా మెకానిక్ లు ఇలా తమ ఇళ్ల వద్దకే వచ్చి సర్వీస్ ఇవ్వడంపై బాధితుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. వరదల్లో భారీగా దెబ్బతిన్న వాహనాలను ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ను సైతం త్వరగా ఇప్పించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంతో బాధితులకు ఊరట లభించనుంది.












Click it and Unblock the Notifications