వైసిపిలో మేడా చేరిక : ఆకేపాటి గైర్హాజరు : జగన్ ఇచ్చిన హామీలివే..అసంతృప్తి తగ్గేనా..!
Recommended Video

ముందుగా నిర్ణయించుకున్నట్లే టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి వైసిపి లో చేరారు. కడప జిల్లా రాజంపేట నుండి 2014 ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచిన ఆయన తన అనుచరులతో కలిసి వైసిపి లో చేరారు. ఆయనకు వైసిపి అధినేత పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. భారీగా తన అనుచరవర్గంతో మేడా తరలి వచ్చారు. అయితే ఈ కార్యక్ర మానికి రాజంపేట వైసిపి ఇన్‌ఛార్జ్ ఆకేపాటి అమర్నాధ రెడ్డి గైర్హాజరవ్వటం ఇప్పడు ఆసక్తి కరంగా మారింది.

భారీ ర్యాలీగా మేడా చేరిక..
కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి వైసిపి లో చేరారు. రాజంపేట నుండి భారీగా అనుచర వర్గం కార్ల ర్యాలీగా లోటస్ పాండ్ కు చేరుకుంది. మేడా మల్లిఖార్జున రెడ్డి..ఆయన సోదరులు ..అనుచరుల తో కలిసి వైసిపి లో చేరారు. వైసిపి అధినేత జగన్ వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత నెల రోజులుగా మేడా మల్లి ఖార్జున రెడ్డి వైసిపి లో చేరుతారనే ప్రచారం జరగుతోంది. గత వారం ఆయన జగన్ తో సమావేశమయ్యారు. అయితే, రాజంపేట నుండి తిరిగి సీటు ఇస్తారా లేదా అనే మీమాంస లో ఆయన కనిపించారు. అయితే, జగన్ తొలి ప్రాధాన్యత అక్కడ తొలి నుండి తనతో ఉన్న అమరనాధరెడ్డికే ఉంటుందని స్పష్టం చేసారు. మేడా చేరిక విషయం పై అమర్నాధ రెడ్డి తో నూ జగన్ చర్చించారు. అటు టిడిపిలో మల్లిఖార్జున రెడ్డి పార్టీని వీడటంతో అక్కడ ఆశావాహుల సంఖ్య ఎక్కు వగా కనిపిస్తోంది.

అమర్నాధ రెడ్డి గైర్హాజరు..
మేడా మల్లిఖార్జున రెడ్డి వైసిపి లో చేరిక కార్యక్రమానికి స్థానిక నేత..రాజంపేట ఇన్‌ఛార్జ్ అకేపాటి అమర్నాధ రెడ్డి గైర్హా జరయ్యారు. మేడా ను పార్టీలోకి తీసుకోవటం పై అమర్నాధరెడ్డి అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. అయితే, ఇదే విషయం పై జగన్..అమర్నాధరెడ్డిని పిలిపించి మాట్లాడారు. ఆ సమావేశం తరువాత అమర్నాధరెడ్డి తన అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. జగన్ తోనే తాను ఉంటానని తేల్చి చెప్పారు. తనకు పెద్ద పదవులు అవసరం లేదని..ఎమ్మెల్యే పదవి ఇస్తే చాలని చెప్పుకొచ్చారు. అయితే, ఈ రోజు జరిగిన మేడా చేరిక కార్యక్రమానికి అమర్నాధరెడ్డి హాజరు కాకపోవ టంతో కొత్త చర్చ మొదలైంది. రాజంపేట ఎంపి మిధున్ రెడ్డి మాత్రమే మేడా చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. దీని పై అమర్నాధ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఆకేపాటి కి జగన్ హామీలు..
రాజంపేట వైసిపి టిక్కెట్ పై జగన్ మేడా కు హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే, వైసిపి నేతలు చెబుతు న్న సమాచారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. మేడా కు జగన్ ఎమ్మెల్యే సీటు పై హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. మేడా రాకతో కొన్ని సర్దుబాట్లు ఆలోచన చేస్తున్నారని పేర్కొంటున్నారు. అమర్నాధరెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు ఎమ్మెల్సీ తో పాటుగా టిటిడి చైర్మన్ పదవి ఇస్తామని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, అమర్నాధరెడ్డి మాత్రం జగన్ తనకే రాజంపేట ఎమ్మెల్యే సీటు ఇస్తారనే నమ్మకంతో ఉన్నట్లు గా ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి..జగన్ ఈ వివాదాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారో..ఏ రకమైన సర్దుబాట్లు చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications