చంద్రబాబుకు షాక్: రంగంలోకి మేథా, 'దోచి పెట్టేందుకే స్విస్ ఛాలెంజ్'
అమరావతి: సింగపూర్ కంపెనీలకు దోచి పెట్టేందుకే నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అవలంభిస్తున్నారని సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ విమర్శించారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
పర్యావరణ అనుమతులు లేకుండా అమరావతి నిర్మాణం జరుగుతోందని ఆమె ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూములను రైతుల వద్ద నుంచి తీసుకోవద్దని ముందే చెప్పిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని గ్రామాల్లోని భూములను ప్రభుత్వం దోచుకుంటుందని ఆమె ఆరోపించారు. ప్రజల హక్కులను కాలరాసే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.
వరదలొస్తే రాజధాని ప్రాంతం అంతా మునిగిపోతుందని ఆమె అన్నారు. చంద్రబాబు ఇంటిపక్కనే ఇసుక క్వారీల పేరుతో కృష్ణా నదిని కొల్లగొడుతున్నారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో ఇసుక దందా చంద్రబాబు ఆశీస్సులతోనే జరుగుతందని అన్నారు.
ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో దళితుల హక్కులను కాలరాస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. కాగా, గతంలో కూడా మేథా పాట్కర్ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌తో రైతులకు కంటే రియల్టర్లకు లాభం చేకూరుతుందని తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications