వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగబాబు వర్సెస్ హరికృష్ణ: కుట్ర జగన్‌పైనా, జూ.ఎన్టీఆర్‌పైనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో వైయస్ జగన్ రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే విషయంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజానికి, ఆ సీటు ఎప్పుడో తన అనుంగు అనుచరుడు విజయసాయి రెడ్డికి ఆయన ఖాయం చేశారు.

కానీ, ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డిని పక్కన పెట్టి నందమూరి హరికృష్ణకు ఇస్తారని ఓవైపు, నాగబాబుకు ఇస్తారని మరో వైపు ప్రచారం సాగుతోంది. నందమూరి హరికృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని, ఆయనకు జగన్ రాజ్యసభ సీటు ఇస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీడియాలో వార్తాకథనాలు కూడా వస్తున్నాయి.

అయితే, జూనియర్ ఎన్టీఆర్‌పైన ఓ సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరిగేలా చేయడానికే ఆ వార్తలను ప్రచారంలో పెడుతున్నారని అంటున్నారు. హరికృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రచారం చేస్తే తెలుగుదేశం వర్గాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ సామాజిక వర్గంలో వ్యతిరేకత ఎదరవుతుందని, దానివల్ల వారి క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని భావించి, దాని కోసమే అలా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

Media gossip on Nagababu and Harikrishna, a conspiracy?

ఇక, నాగబాబును వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తేవడానికి ఆ పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కూడా పుకార్లు షికార్లు చేయడమే కాకుండా మీడియాలో వార్తాకథనాలు కూడా వస్తున్నాయి. నాగబాబుతో కలిసి రోజా జబర్దస్త్ టీవీ కార్యక్రమంలో పాల్గొనడాన్ని ఆసరా చేసుకుని ఆ విధమైన ప్రచారం సాగిస్తున్నారని అంటున్నారు.

అలా చేయడానికి కారణం, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని దెబ్బ తీయడానికే కాకుండా పవన్ కల్యాణ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి కూడా అని అంటున్నారు. ఆ విధంగా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత స్థితిలో బలహీనపడకుండా ఉంటుందని భావిస్తున్నారని అంటున్నారు.

ఇక, ఆ విధమైన ప్రచారాలు చేయడం ద్వారా అటు హరికృష్ణను, ఇటు నాగబాబును పార్టీలోకి తీసుకోవడానికి వైయస్ జగన్ తాపత్రయపడుతున్నారని చెప్పడం ద్వారా ఆయన బలాన్ని తగ్గించి చూపుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా, విజయసాయి రెడ్డిలో కూడా ఓ విధమైన అభద్రతా భావాన్ని కల్పించి, అనుమానాలు రేకెత్తేలా చేయడం కూడా అందులోని ఆంతర్యమని అంటున్నారు.

అయితే, నాగబాబును గానీ ఆయన సోదరులను గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తాకథనాలకు అంతగా క్రెడిబిలిటీ లేకపోవడంతో ప్రధానమైన మీడియా పట్టించుకోవడం లేదు. హరికృష్ణకు సంబంధించిన వార్తాకథనాల పరిస్తితి కూడా అదే.

English summary
it is said that YSR Congress party opponents are creating rumors about political entry of Harikrishna and Nagababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X