Ramoji rao: చిరుద్యోగి నుంచి కింగ్ మేకర్ గా ఎదిగిన రామోజీ-స్ఫూర్తిదాయక ప్రస్ధానం..!

రామోజీ రావు పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానీ వెంటనే గుర్తుకొచ్చేది ఆయన మీడియా సామ్రాజ్యం. అందులో భాగమైన ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానళ్లు మాత్రమే. కానీ ఆయన సృష్టించిన ఓ వ్యాపార సామ్రాజ్యంలో ఇవి ఓ మూలకొస్తాయంటే నమ్మక తప్పదు. ఎక్కడో కృష్ణాజిల్లాలోని పెదపారుపూడిలో జన్మించిన చెరుకూరి రామయ్య కాస్తా రామోజీరావుగా మారి ఓ చిన్న యాడ్ ఏజెన్సీలో చిరుద్యోగిగా పనిచేసి, ఆ తర్వాత కఠోర శ్రమనే నమ్ముకున్న ప్రస్ధానం భవితరాలకు నిజంగానే ఆదర్శప్రాయం.

1936లో కృష్ణాజిల్లాలోని పెదపారుపూడి గ్రామంలో జన్మించిన రామోజీరావు 1974లో ఈనాడు దినపత్రికను విశాఖలో ప్రారంభించే వరకూ చాలా మందికి తెలియదు. కృష్ణాజిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం, ఉన్నత విద్యను కొనసాగించిన రామోజీరావు, ఆ తర్వాత ఢిల్లీ వరకూ వెళ్లి యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత స్వస్థలానికి తిరిగివచ్చి చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1974లో విశాఖలో ఈనాడు పత్రికను స్థాపించి క్రమంగా ఎదిగారు.

Media moghal ramoji rao s inspirational career from small employee to padmabhushan awardee

నాలుగేళ్లలోనే ఈనాడు పత్రికను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన రామోజీరావు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1995 నాటికి ఈనాడు టీవీ (ఈటీవీ) పేరుతో తొలి తెలుగు ఛానల్ ను తీసుకొచ్చారు. ఈటీవీ-మీటీవీ అనే స్లోగన్ తో తెలుగువారి వాకిళ్లలోకి ఈనాడు పత్రికతో పాటు ఈటీవీ కూడా ప్రవేశించింది. దీంతో రామోజీ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఎన్ని తెలుగు న్యూస్ ఛానళ్లు వచ్చినా విశ్వసనీయంగా వార్తల్ని అందించడంలో ఈనాడు, ఈటీవీని ఎవరూ అందుకోలేకపోయారు.

అదే 90వ దశకంలో హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి రికార్డు సృష్టించారు. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం ఓ చరిత్ర. దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ నిర్మాణంతో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు అన్ని చిత్ర పరిశ్రమలు తమ సినిమాల్నీ, సీరియళ్లనూ ఇక్కడే నిర్మించడం మొదలుపెట్టాయి. అదే సమయంలో నిర్మాతగా మారి ప్రతిఘటన, మౌనపోరాటం వంటి విప్లవాత్మక సినిమాలను నిర్మించి తానే స్వయంగా పంపిణీ కూడా చేశారు. ఓవైపు ప్రియ పచ్చళ్ల వ్యాపారం, మరోవైపు సినిమాల నిర్మాణం, ఇంకోవైపు మీడియా రంగంలో విజయాలు, అటు మార్గదర్శి చిట్స్ ఇలా చూస్తుండగానే రామోజీ ఓ పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించేశారు.

ఓ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ఏడాదికి కల్పించే ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలను తన గ్రూపు సంస్థల్లోనే కల్పించి రామోజీరావు రికార్డు సృష్టించారు. ఇదంతా ఓ ఎత్తయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వరకూ రాజకీయాల్ని సైతం శాసించిన ధీశాలి రామోజీరావు.

ఎన్టీఆర్ నుంచి ప్రారంభించి చంద్రబాబు, వైఎస్సార్, మోడీ వంటి రాజకీయ దిగ్గజాలు ఏదో ఒక సమయంలో రామోజీ ఆశీస్సులు తీసుకున్న వారే. ఇప్పటికీ రామోజీరావు మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఆయన ఇంటికి క్యూ కడుతూనే ఉన్నారంటే రాజకీయాలపై, ప్రభుత్వాలపై ఆయన ప్రభావం ఎలాంటిదో అర్దం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు ఆయన తలుపుతట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+