రాజమండ్రిలో వైద్యవిధ్యార్థిని ఆత్మహత్య, ఆమె మరణం వెనుక...?

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజమండ్రి :తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని జిఎస్ ఎల్ మెడికల్ కాలేజీ విధ్యార్థిని మృతి అనుమానాస్పదంగా మారింది. కాలేజీ హస్టల్ భవనం పై నుండి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్ కారణంగానే ఆమె ఆత్మహత్యచేసుకొందనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి..అయితే ఆమె మానసిక ఇబ్బందుల కారణంగా గతంలో కూడ రెండు దఫాలు ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించిందని కళాశాల యాజమాన్యం చెబుతోంది.

జిఎస్ ఎస్ మెడికల్ కాలేజీలో శుభశ్రీ ఎంబి బిఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆమె గురువారం తెల్లవారుజామున హాస్టల్ భవనం నాలుగో అంతస్థు నుండి దూకీ ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

medico conitted sucide at rajamundrymedico conitted sucide at rajamundry

రెండు వారాల క్రితం శుభశ్రీ ర్యాగింగ్ పై కళాశాల ఫ్రిన్సిఫాల్ కు ఫిర్యాదుచేసింది. తనను నలుగురు విధ్యార్థులు ర్యాగింగ్ చేశారని ఆమె ప్రిన్సిపాల్ కు చెప్పింది. అయితే ర్యాగింగ్ పై ప్రిన్సిఫాల్ విచారణకు ఆదేశించారు. ఈమేరకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ర్యాగింగ్ పై విచారణ చేస్తోంది.

అయితే శుభశ్రీ ఆత్మహత్యచేసుకోవడానికి ర్యాగింగ్ సంబంధం ఉందా, ఇంకా మరేఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో కూడ రెండు దఫాలు శుభశ్రీ ఆత్మహత్యకు ప్రయత్నించిందని కళశాశాల యాజమాన్యం ప్రకటించింది. ఆమె మానసిక ఇబ్బందుల కారణంా ఆత్మహత్యయత్నం చేసిన విషయాన్ని కలశాశాల యాజమాన్యం గుర్తు చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
medico comitted sucide in rajamundry on thursday morning. shubasree studying mbbs 4th year in gsl medical college at rajamundry. two weeks back she get ragging with four students she complient against 4 students, priniciple appoint a comitte for enquiry this raging incident, shubhsri facing some problmes sucide attems twice long back said college management.
Please Wait while comments are loading...