Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సోమవారం జగన్ పాదయాత్రకు విరామం...పార్టీ ఎంపీలతో సమావేశం

గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైసిపి అధినేత జగన్ మోహన్‌రెడ్డితో సోమవారం సాయంత్రం ఆ పార్టీ ఎంపీలు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని ముప్పాళ్ళలో ఈ భేటీ జరగనున్నట్లు తెలిసింది.

తమ పార్టీ అధ్యక్షుడు జగన్ తో జరిగే ఈ కీలక సమావేశానికి వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీలు హాజరవుతారని ఆ పార్టీ గుంటూరు జిల్లా నేతలు తెలిపారు. ఈ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీలు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. వైసిపి ముందుగానే ప్రకటించినట్లుగా ఏప్రిల్‌ ఆరో తేదీన వైసీపీ ఎంపీలతో రాజీనామా చేసే అంశంపై కీలక నిర్ణయం ఈ భేటీలోనే తీసుకునే అవకాశం ఉంది.

Meeting of YCP MPs with Jagan on Monday

ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నజగన్‌ 120 వ రోజు పాదయాత్ర ఆదివారం నరసరావుపేట మండలం నుంచి ప్రారంభమై సత్తెనపల్లి నియోజకవర్గంలోని గోళ్ళపాడు మీదుగా ముప్పాళ్ళకు చేరుకుంది. మరోవైపు జగన్‌ పాదయాత్రకు శ్రీరామనవమి పండుగ సందర్భంగా సోమవారం విరామం ఇచ్చారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+