"మెగా" సెలబ్రేషన్స్ - కాబోయే జంటతో ఎంజాయ్ చేస్తూ..!!
మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోటకు చేరింది. సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో ఎంజయ్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నాగబాబు దంపతులతో పాటుగా మెగా హీరోలంతా ఈ కలర్ ఫుల్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్న అరుదైన ఫొటోలను మెగాస్టార్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒక్కటి కానున్నారు. రీసెంట్‌గా మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లోనే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నంత సింపుల్‌గా కాకుండా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసారు. ఆ తరువాత ఇద్దరు సినిమా షూటింగ్స్ లో బిజీ అయిపోయారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ఆ పెళ్లి సందడిలో ఉన్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన షాపింగ్ కోసం వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి విదేశాల్లో పర్యటించారు. ఇప్పుడు తాజాగా వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మెగా కాంపౌండ్ లో ఘనంగా నిర్వహించారు. వీరి వివాహం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో మిస్టర్ సినిమ షూటింగ్ ఇటలీలోనే జరిగింది. ఆ సమయంలోనే వీళ్ల లవ్ ట్రాక్ నడిచింది. అయితే ఆ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికి వీళ్లిద్దరి ప్రేమ మాత్రం ఏడడుగుల వరకు వెళ్లింది. జూన్ 9న నిశ్చితార్దం చేసుకున్న వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూతురు పుట్టడం, బారసాల వేడుక తో మెగా ఇంట వరుస శుభకార్యాలతో సందడి వాతావరణ నెలకొంది. ఇప్పుడు వరుణ్ తేజ్ - లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఈ ఫొటోలు ఇప్పుడు మెగా అభిమానుల మధ్య వైరల్ గా మారాయి.
About Last evening ..
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2023
Pre Wedding Celebrations of @IAmVarunTej & @Itslavanya #MomentsToCherish pic.twitter.com/TwUqaSUmXD












Click it and Unblock the Notifications