ఏపీలో జగన్ ను కోరుకుంటున్న వారు ఎంత మంది - తాజా సర్వే సంచలనం..!!

ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రతీ ఇంటికి వెళ్లి మెగా పల్స్ సర్వే ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని కోటి 45 లక్షల కుటుంబాలకు వెళ్లి జగన్ పాలన గురించి ఆరా తీసారు. ఈ సర్వేలో అనూహ్య స్పందన కనిపించింది. రాష్ట్రంలోని మొత్తం కోటి 60 లక్షల కుటుంబాలకు వెళ్లి ఈ నాలుగేళ్ల పాలన పైన ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనే ప్రయత్నం చేసారు. అనూహ్యంగా కోటి 10 లక్షల కుటుంబాలకు జగన్ కు మద్దతు ప్రకటించాయి.

జగన్ పాలనకు మద్దతు :ఏపీలో జగన్ పాలనకు దాదాపు 80 శాతానికి పైగా కుటుంబాల నుంచి మద్దతు లభించింది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా 7 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 రోజులకు పైగా సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 1.45 లక్షల కుటుంబాలను కలిసారు. వారి అభిప్రాయాలు సేకరించారు.

 jagan

అందులో కోటి పది లక్షల మంది జగన్ కు మద్దతుగా వైసీపీ ఏర్పాటు చేసిన నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చారు. దీనికి సంబందించిన వివరాలను పార్టీ నేతలు వెల్లడించారు. ఈ రోజుతో ఈ సర్వే పూర్తి కానుంది. రాష్ట్రంలోని ఒకే సమయంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే నిర్వహించారు. దీని ద్వారా ప్రజా మూడ్ తెలుసుకొని అవసరమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.

పది నెలలు కీలకంగా : గత పాలన..ప్రస్తుత పాలన గురించి వివరిస్తూ ప్రతీ ఇంటికి వెళ్లి కరపత్రాలు అందించారు. ప్రతీ ఇంటికి జగన్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమం గురించి వివరిస్తూ ఆరా తీస్తున్నారు. గత పాలనలో అందని సంక్షేమం ,మంచి జగన్ పాలనలో ప్రతీ ఇంటికి అందుతుందని వివరిస్తున్నారు. జగన్ పాలన నచ్చితే మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే దాదాపు కోటి పది లక్షల కుటుంబాల నుంచి జగన్ కు మద్దతుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి మిస్డ్ కాల్స్ వచ్చాయని పార్టీ నేతలు వెల్లడించారు. మిస్డ్ కాల్స్ ఇచ్చిన వారందరికీ జగన్ వాయిస్ తో రికార్డు చేసిన సందేశం పంపుతున్నారు. ఇందు కోసం ముందుగానే సిద్దం చేసిన పార్టీ నేతలు, కో ఆర్డినేటర్లు తమ ప్రాంతాల్లో ప్రతీ గడపకు వెళ్తున్నారు.

 jagan

జనం మధ్యన జగన్ నినాదం : అటు ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రతీ సభలోనూ ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ ఎందుకు సంక్షేమ ఫలాలు అందలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు లక్షల 9 వేల కోట్ల నిధులు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పుకొచ్చారు. తన పాలనలో మంచి జరిగిందని నమ్మితే తనకు అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు.

తన ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం మీరేనని చెప్పుకొచ్చారు. సంక్షేమం కొనసాగాలంటే జగన్ మరో సారి అధికారంలోకి రావాలని పార్టీ నేతలు వివరిస్తున్నారు. దీంతో, ఇప్పుడు రాష్ట్రంలోని ఏకంగా 1.10 కోటి కుటుంబాల నుంచి జగన్ పాలనకు మద్దతు రావటంతో పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ మరింత పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+