వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ హడావుడి: చిరు మొగల్తూరు పర్యటనపై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి ఆ పార్టీకి దూరమవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే కూడా ఇది అవుననే అనిపిస్తోంది. చిరంజీవి బీజేపీలో చేరనున్నారంటూ మీడియాలో పెద్దఎత్తున వార్తలు రాగా, వాటిని ఆయనే స్వయంగా ఖండించారు.

ఒకటి చాలదు, మరిన్ని: దత్తత గ్రామాలపై చిరంజీవి(పిక్చర్స్)

అయినప్పటికీ... చిరంజీవి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, పాలకొల్లులో జరిగిన సంఘటనలు, ఆపై కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం అభిమానుల్లో పలు పార్టీ మారే ఆలోచనపై ఊహాగానాలు రేకెత్తిస్తున్నాయి.

మొగల్తూరు మండలం తీరప్రాంత గ్రామమైన పేరుపాలెం సౌత్‌ను 'ప్రధానమంత్రి సాంసద్‌ ఆదర్శ గ్రామ యోజన'లో చిరంజీవి దత్తత తీసుకున్నారు. రెండు రోజులు క్రితం మొగల్తూరు వచ్చిన ఆయన తన ఎంపీ నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన మూడు సామాజిక భవనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi step towards ysr congress in Andhra Pradesh

పేరుపాలెం సౌత్‌లో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు చిరంజీవి భూమిపూజ చేశారు. కాగా, చిరంజీవి వచ్చారని తెలిసి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే చిరంజీవి పర్యటన గురించి కాంగ్రెస్ నేతలకు తెలియకపోయినా, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాత్రం చిరంజీవి వస్తున్న విషయాన్ని వారం రోజుల ముందే ప్రకటించారు.

ఆయన వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారని చెప్పి, అందుకు ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకున్నారు. అయితే, అధికారికంగా వైసీపీ నేతలు చిరంజీవి పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు బయటకు కనిపించకుండా, అది కాపు కులస్తుల కార్యక్రమమే అని చూపించడంలో విజయం సాధించారు.

చరిత్ర తిరగరాస్తాం: బాలకృష్ణ, చిరంజీవి కోసం సొంతూరు వెయిటింగ్

Megastar Chiranjeevi step towards ysr congress in Andhra Pradesh

అయితే ఇప్పుడు చిరంజీవి పర్యటనపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు కూడా చెప్పకుండా ఆయన పర్యటన సాగడం, అంతకుమించి వైసీపీ నేతలకు ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పడం, తన పర్యటనలో కాంగ్రెస్ నేతలను చేర్చనీయకుండా జగన్ వర్గానికి పెద్ద పీట వేయడంపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై చిరంజీవిపై హై కమాండ్‌కు ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి బీజేపీలోకి చేరుతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే వాటిని చిరంజీవి ఖండించారు. పార్టీల ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా చిరంజీవి పార్టీ మారుతారా? లేక కాంగ్రెస్ లోనే ఉంటారా? చూద్దాం.

English summary
Megastar Chiranjeevi step towards ysr congress in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X