జగన్ స్కీమ్‌కు మెగాస్టార్ బ్రాండ్ అంబాసిడర్: సరిగ్గా ఎన్నికల టైమ్‌లో

Megastar Chiranjeevi: నేడు మే డే. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది కార్మికులు ఘనంగా మే డేను జరుపుకొంటోన్నారు. పలు చోట్ల జెండాలను ఎర్రజెండాలను ఎగురవేశారు. వామపక్షాల అనుబంధ కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ వివిధ నగరాల్లో ర్యాలీను నిర్వహించాయి.

మే డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని నినదించారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్చాలని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Megastar Chiranjeevi wishes May Day and says no to child labour

దీనిపై 22 సంవత్సరాల కిందట చిత్రీకరించిన ఓ వీడియోను ఆయన నేడు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 22 సంవత్సరాల కిందటి ఈ వీడియో.. ఇప్పటి పరిస్థితులకు కూడా అద్దం పడుతుందని భావించడం వల్లే దీన్ని షేర్ చేశానని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అచ్చంగా ఇలాంటి వ్యవస్థను తీర్చిదిద్దందంటూ చెబుతున్నారు నెటిజన్లు. జగన్ ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు పథకం కింద ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఎదిగాయని గుర్తు చేస్తోన్నారు.

మెగాస్టార్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. అలాంటి వాతావరణమే ఏపీలోనూ నెలకొందని అంటోన్నారు. అమ్మఒడి పథకం కింద ప్రతి పేద మహిళ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోగలుగుతున్నారని స్పష్టం చేస్తోన్నారు.

22 సంవత్సరాల నాటి ఈ వీడియోను ఇప్పుడు షేర్ చేయడం ద్వారా- వైఎస్ జగన్ చేపట్టిన నాడు-నేడు పథకానికి చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్టు కనిపిస్తోందని కామెంట్స్ చేస్తోన్నారు నెటిజన్లు. ఆయన పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నాడు- నేడు పథకం కింద గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇంగ్లీష్‌లో విద్యాబోధనను అందించడానికి వైఎస్ జగన్ ప్రయత్నాలు చేసినప్పుడు మీ తమ్ముడు పవన్ కల్యాణ్ అడ్డుకున్నాడని, తెలుగును పరిరక్షించాలంటూ ఉద్యమించాడంటూ చిరంజీవికి గుర్తు చేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+