వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేము సిద్దం -ఆ ప్రయత్నాలు లేవు : టీడీపీకి ధన్యవాదాలు : మేకపాటి ఆసక్తికర వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

ఆత్మకూరు ఉప ఎన్నిక ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్దిగా మేకపాటి విక్రమ్ రెడ్డి ఖరారయ్యారు. బై పోల్ లో ఆయనే అభ్యర్ధిగా ఖరారు అయిన సమయం నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి ప్రభుత్వం మొదలు ..ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత తన ప్రచారం కంటిన్యూ చేస్తున్నారు. రేపు ( జూన్ 2 ) విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. విక్రమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి తో కలిసి నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, టీడీపీ పోటీలో ఉండటం లేదని ప్రకటించింది.

రేపు విక్రమ్ రెడ్డి నామినేషన్

రేపు విక్రమ్ రెడ్డి నామినేషన్

జనసేన సైతం ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇదే సమయంలో బీజేపీ ముగ్గురు అభ్యర్దుల పేర్లను తమ పార్టీ హైకమాండ్ ఆమోదం కోసం పంపింది. మేకపాటి బంధువు ఒకరిని బరిలోకి దింపాలని భావిస్తోంది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలో తాము పోటీకి దిగటం ద్వారా 2019 సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించామని..తాము కుటుంబ వారసత్వ రాజకీయాలకు దూరమని బీజేపీ నేతలు చెబుతున్నార. ఇదే సమయంలో ఆత్మకూరు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికకు తాము అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

టీడీపీ - జనసేన దూరంగా

టీడీపీ - జనసేన దూరంగా


ఉప ఎన్నిక విషయంలో టీడీపీ నిర్ణయం పైన ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబంలో అనుకోని విషాదం చోటు చేసుకోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైందని.. తప్పనిసరి పరిస్థితుల్లో తన రెండో కుమారుడు విక్రమ్ రెడ్డిని పోటీకి నిలబెట్టినట్లు చెప్పుకొచ్చారు. బీజేపీతో పాటుగా ఇతరులు పోటీ చేసినా.. తాము మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని విక్రమ్ రెడ్డి వెల్లడించారు. జూన్ 2న నామినేషన్ వేస్తున్నామని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని చెప్పారు.

మెజార్టీ పైనే సీఎం జగన్ ఫోకస్

మెజార్టీ పైనే సీఎం జగన్ ఫోకస్


ఈ నెల 4 లేదా 5వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వైసీపీ అభ్యర్దితో పాటుగా జిల్లాకు చెందిన నేతలు.. మంత్రులకు ఆత్మకూరు బై పోల్ లో గెలుపు బాధ్యతలను సీఎం జగన్ అప్పగించనున్నారు. అదే విధంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా వైసీపీ గెలుపు కంటే..ఈ సారి మెజార్టీ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా వైసీపీ ఆధిపత్యం కొనసాగేలా వ్యూహాలు అమలుకు రంగం సిద్దం చేస్తున్నారు. దీంతో..నామినేషన్ నుంచే తమ బలం చాటుకొనేలా మేకపాటి కార్యాచరణ అమలు చేయనున్నారు.

English summary
Mekapati Vikram Reddy decided to file on nomination for Atamakur by poll on 2nd june, YSRCP concentrating on majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X