మోడీకి 272 సీట్లు శాపం, 2019లో ఒంటరిపోరు కానీ ఆ తర్వాత..: మేకపాటి ఆసక్తికరం

Posted By:
Subscribe to Oneindia Telugu
  చంద్రబాబు అసమర్థత వల్లే ప్రత్యేక హోదా రాలేదు

  అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో రాజ్యాంగపరంగా నేను ఏం చేయగలనో అది చేస్తానని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తమకు చెప్పారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం చెప్పారు. వైసీపీ ఎంపీలు ఆయనను కలిసి హోదా, విభజన హామీల అంశంపై వినతిపత్రం అందించారు.

  హరిబాబు రాజీనామా, బీజేపీ లెక్కలు: బాబుకు షాక్, తెరపైకి పురంధేశ్వరి? రేసులో వీరే!

  అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఏపీని కేంద్రం పట్టించుకోవడం లేదని, హోదా ఏపీ ప్రజల హక్కు అని, ఎప్పటికైనా సాధించుకుంటామని, విభజన హామీలు అమలు అమలు చేయకుంటే చరిత్రలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేనివాడిగా మిగిలిపోతుందన్నారు. అదే సమయంలో చంద్రబాబుపై కూడా మండిపడ్డారు.

  బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందనే

  బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందనే

  బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతుందనే టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని మేకపాటి ఆగ్రహించారు. ఢిల్లీని మించిన రాజధాని కడతామని, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు తదితర ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని మోడీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరికాదన్నారు. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ ఇప్పుడు తమపై నిందలు వేస్తోందన్నారు.

   మోడీకి 272 సీట్లు ఏపీకి శాపం

  మోడీకి 272 సీట్లు ఏపీకి శాపం

  ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది జగన్ మాత్రమేనని మేకపాటి అన్నారు. చంద్రబాబు హోదాపై ఎన్నో యూటర్న్‌లు తీసుకున్నారని చెప్పారు. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి ఉండి ఇప్పుడు తాము బీజేపీతో స్నేహం చేస్తున్నామని టీడీపీ నేతలు విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రపతికి తాము అన్ని వివరాలు చెప్పామన్నారు. మోడీకి 272 సీట్లు రావడం ఏపీకి శాపంగా మారిందన్నారు.

  2019లో పోటీపై స్పష్టత

  2019లో పోటీపై స్పష్టత

  అదే సమయంలో 2019లో ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసే అవకాశాలను మేకపాటి కొట్టి పారేశారు. తాము స్వతంత్రంగానే పోటీ చేస్తామని, ఎన్నికల తర్వాత ఎవరికి మద్దతివ్వాలి, ఏపీకి ప్రయోజనాలు ఎవరు చేకురుస్తారు.. అనే అంశాలపై తమ మద్దతు ఆధారపడి ఉంటుందని చెప్పారు. హామీలు ఇచ్చిన మోడీ పట్టించుకోకపోవడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు కూడా అందుకు బాధ్యులే అన్నారు. నిన్నటి బంద్ విజయవంతమైందన్నారు. హోదాతోనే ఏపీ అభివృద్ధి అన్నారు.

  చరిత్రలో మోడీ అలా నిలిచిపోతారు

  చరిత్రలో మోడీ అలా నిలిచిపోతారు

  ఏపీకి ప్రత్యేక హోదా మన హక్కు అని, అది ఎప్పటికైనా రావాల్సిందేనని మేకపాటి అన్నారు. హామీలు నెరవేర్చకుంటే మోడీ అమలు చేయని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. రాజ్యాంగపరంగా ఏం చేయగలమో అది చేస్తామని ఆయన చెప్పారన్నారు.

  మేం రాజీనామా చేసిన చోట ఉప ఎన్నికలు

  మేం రాజీనామా చేసిన చోట ఉప ఎన్నికలు

  మొన్న బడ్జెట్ సమావేశాల్లో 5 కోట్ల ఆంధ్ర ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము రాజీనామాలు చేశామని, నిరవధిక దీక్షకు కూర్చున్నామన్నారు. ఆరు రోజుల తర్వాత తమ ఎంపీల నిరవధిక దీక్షను పోలీసులతో బలవంతంగా భగ్నం చేయించారన్నారు. ఈ విషయాలన్నింటిని రాష్ట్రపతికి వివరించామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడింది రాష్ట్రపతి అన్నారు. రాజీనామా చేయడంతోనే మా పోరాటం ఆగలేదని, ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. మేం రాజీనామా చేసిన ఐదు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు గెలిచి మరింత ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. హోదా ఏపీకి ఊపిరి వంటిది అన్నారు. రాజీనామాలు తప్పకుండా ఆమోదిస్తారని భావిస్తున్నామని, లేదంటే మరోసారి స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు.

  ఎలా నష్టపోయిందో చెప్పాం

  ఎలా నష్టపోయిందో చెప్పాం

  ఏపీ కోసం గత నాలుగేళ్లుగా పోరాడుతోందని, హామీలు నెరవేర్చకపోవడంలో టీడీపీ అసమర్థత కూడా ఉందని ఎంపీ వరప్రసాద్ అన్నారు. విభజన తర్వాత ఏపీ ఎలా నష్టపోయిందో చెప్పామన్నారు. ఏపీకి హోదా వస్తే ఇప్పటి వరకు ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉండేవన్నారు. చంద్రబాబు ఏమీ తీసుకు రాలేకపోయారన్నారు. టీడీపీ అసమర్థత వల్ల ఏపీకి కేంద్రం సాయం చేయలేదన్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే ప్రత్యేక హోదా రాలేదని మండిపడ్డారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSRCP MP Mekapati Rajamohan Reddy and YSRCP MPs meets President Ramnath Kovind, takes on PM Narendra Modi and AP CM Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X