పేకాడుతూ దొరికిన వారిని నడి రోడ్డులో అర్ధనగ్నంగా నడిపించిన ఎస్సై

Subscribe to Oneindia Telugu

ఏలూరు: పేకాడుతూ పట్టుబడిన వారిని అర్ధ నగ్నంగా బైకు లు తొయిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాడు ఓ ఎస్సై. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీసులు ఈ విషయం లో ఓవర్‌ యాక్షన్‌ చేయడం అక్కడ చర్చినీయాంశం అయ్యింది. చింతలపూడి పరిధిలో ఆరుగురు యువకులు పేకాడుతుండగా పోలీసులు పట్టుకున్నారు.

దొరికిన ఆరుగురిని నడి రోడ్డుపై అర్ధనగ్నంగా నడిపించుకుంటూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు అక్కడి పోలీసులు. అర్ధనగ్నంగా ఉన్న వారితోనే వారి బైక్‌లను నెట్టిస్తూ మూడు కిలోమీటర్లు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. సీఐ రాజేష్‌ ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగింది.పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.

Men were paraded half naked for playing cards

పైగా పేకాడినా, ఇతర నేరాలకు పాల్పడినా ఎం జరుగుతుందో అందరికీ తెలియడం కోసమే ఇలా చేశామంటూ పోలీసులు సమర్ధించుకుంటున్నారు. దీనితో బాధితుల బంధువులు చింతలపూడి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు.

సీఐ రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. మానవ హక్కులను హరించే విధంగా సీఐ ఎలా ప్రవర్తిస్తారంటూ నిలదీశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇది ఇలా ఉంటే, కొన్ని రోజుల క్రితం ప్రగడవరంలోనూ పేకాటరాయుళ్లను సిఐ రాజేష్ అర్ధనగ్నంగా నడిపించారు.
చింతలపూడి సీఐలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గంజాయి స్మగ్లర్లకు సహకరించినందుకు గతంలో సీఐ దాసుపై సస్పెన్షన్ వేటు పడింది అయినప్పటికీ వీరి ప్రవర్తనలో మార్పు రావటం లేదని స్థానికులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Men were paraded half naked on the roads by an SI for playing cards at Chinthalappud in West Godavri district

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి