విజయవాడలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం: యాదవ నేతల సంబరం

Subscribe to Oneindia Telugu

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చిత్రపటానికి విజయవాడలో పాలాభిషేకం చేశారు. యాదవ కులస్తులకు రాజ్యసభ సీటు అవకాశం ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో యాదవ యువభేరి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యాదవ నేతకు రాజ్యసభ సీటును ప్రకటించేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు పాలాభిషేకాలు చేస్తూనే ఉంటామని నేతలు స్పష్టం చేశారు.

milk bath to CM KCR photo in Andhra Pradesh

రాజ్యసభకు యాదవ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అమరావతి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదాన్ని కేసీఆర్‌కు అందజేస్తామని తెలిపారు.

యాదవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గొల్లకుర్మల సంక్షేమ భవన సముదాయానికి శంకుస్థాపన చేయడం అద్భుతమని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి అభినందనీయమని యాదవ సంఘం నేతలు పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Milk bath done to Telangana CM K Chandrasekhar Rao photo in Vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి