నరసరావుపేట లో పొద్దు పొద్దునే, పాలవ్యాపారి దారుణ హత్య

Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేట ఎస్ఆర్‌కెటి కాలనీ లో మాతంగి కన్నా అను పాల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణం గా నరికి చంపారు. గతం లోనూ ఇక్కడ ఇద్దరు రౌడీ షీటర్ల హత్యలు జరిగాయి. మరలా అదే ప్రాంతం లో కన్నా హత్య జరగటం అక్కడ చర్చనీయామశం అయ్యింది.

ఉదయాన్నే మార్కెట్ కి వెళుతున్న కన్నా ని గుర్తు తెలియని దుండగులు కాపువేసి హత్య చేశారు.మారణాయుధాలతో బైకు పై వెళుతున్న వ్యక్తి ని ఆపి బైక్ పై ఉండగానే నరికి చంపారని స్థానికులు అంటున్నారు. హత్యకు గురైన కన్నా కి స్థానికం గా ఉండే ఓ రౌడీ షీటర్ కి ఎదో విషయం లో గొడవ అయ్యిందని అప్పుడు ఆ రౌడీ షీటర్ కన్నాని హతమారుస్తానని ఆరోజు బెదిరించాడాని మృతుడి భార్య చెబుతుంది.

Milk vendor hacked to death at Narsaraopet

ఆ రౌడీ షీటర్ హతమార్చి ఉంటాడని చెబుతున్న మృతుడు భార్య పోలీసులకు సమాధానం సరిగా చెప్పటం లేదు. కన్నా ను హతమార్చిన హంతకుడు వల్ల తనకు ప్రాణహాని ఉంది అని ఆమె భయపతుంది. మొత్తానికి పాత కక్ష్యల నేపథ్యం లో ఈ హత్య జరిగిందని పోలీసులు ప్రాధమిక సమాచారం లో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని పిలిపించి వివరాలు, ఆధారాలు రాబట్టే పనిలో ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Milk vendor at Narsaraopet in Guntur district in Andhra Pradesh has been hacked to death
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి