బోరుగడ్డ బిర్యానీ స్టోరీలో మైండ్ బ్లాకింగ్ ట్విస్టులు-డబుల్ ఎస్కార్ట్-పోలీసుల బిల్లు కట్టిందీ వారే..!
వైసీపీ హయాంలో ఆ పార్టీ పెద్దల అండతో విపక్ష నేతలపై బూతులతో రెచ్చిపోయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ బిర్యానీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమరావతిలో నమోదైన రెండు కేసుల్లో కోర్టు రిమాండ్ విధించాక రాజమండ్రి సెంట్రల్ జైలుకు అతన్ని తరలించే క్రమంలో పోలీసులు ఓ రెస్టారెంట్ లో బిర్యానీ పెట్టించి సస్పెండ్ కావడం ఇప్పటికే సంచలనం రేపుతుండగా.. మరిన్ని ట్విస్టులు బయటపడ్డాయి.

బోరుగడ్డను గుంటూరు కోర్టులో హాజరుపర్చాక రెండు కేసుల్లో న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. దీంతో బోరుగడ్డను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు ఎస్కార్ట్ తో తీసుకుని బయలుదేరారు. మార్గ మధ్యలో గన్నవరంలో భోజనం కోసం ఆగారు. ఎయిర్ పోర్టు ఎదురుగా ఉన్న ఓ రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని బోరుగడ్డ కోరడంతో పోలీసులు అక్కడికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వారు బిర్యానీ తినే లోపే స్థానిక గన్నవరం టీడీపీ కార్యకర్త ఒకరు వీరి ఫొటోలు తీశారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది.
టీడీపీ కార్యకర్త ఫోన్ లో ఫొటోలు తీస్తున్నట్లు చూసిన బోరుగడ్డ, పోలీసులు అతన్ని పట్టుకుని ఫొటోలు డిలీట్ చేయించారు. ఆ తర్వాత విషయం పెద్దవుతుందని తెలిసి బిర్యానీ తినకుండానే బయలుదేరిపోయారు. తిరిగి ఏలూరు బైపాస్ దగ్గర ఆగి అక్కడ మరో రెస్టారెంట్లో వీరంతా భోజనం చేశారు. అక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది. ఆ బిల్లును పోలీసులు కట్టలేదు, బోరుగడ్డ కూడా కట్లలేదు. అక్కడే ఉన్న బోరుగడ్డ అనుచరులతో పోలీసులు కట్టించారు. ఈ వివరాలను పోలీసులు సేకరించారు. బోరుగడ్డ అనుచరులతో బిల్లు కట్టించిన పోలీసులపై శాఖాపరమైన విచారణ చేస్తున్నారు.
అయితే గన్నవరం రెస్టారెంట్లో జరిగిన వ్యవహారాన్ని ఫొటో తీసిన ప్రత్యక్ష సాక్షి, టీడీపీ కార్యకర్త నితిన్ నిన్న విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు బయటపెట్టాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించకుండా గన్నవరం దగ్గర క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ కు బోరుగడ్డను తెచ్చారని, బోరుగడ్డ, సీఐ, బోరుగడ్డ స్నేహితుడు రెస్టారెంట్లోకి వచ్చారని అతను తెలిపాడు. బోరుగడ్డ స్నేహితుడు ఫుడ్ ఆర్డర్ చేశాడని, బోరుగడ్డ సీఐ ఫోన్ తీసుకుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడని, అతని స్నేహితుడు తెల్లచొక్కా వేసుకున్నాడని నితిన్ వెల్లడించాడు.
గడ్డం తీయడంతో బోరుగడ్డను ఎవరూ గుర్తు పట్టలేకపోయారని, తాను మాత్రం ఆయన్ను గుర్తుపట్టి ఫోన్ లో ఫొటో తీశానని నితిన్ తెలిపాడు.. వెంటనే బోరుగడ్డ చూసి సీఐకి చెప్పాడని, సీఐ తనను బెదిరించి ఫొటో డిలీట్ చేయించాడని నితిన్ పేర్కొన్నాడు. సమస్య అవుతుందని తెలిసి వెంటనే జారుకున్నారన్నారు. వెళ్లేటప్పుడు బోరుగడ్డ తన దగ్గరికొచ్చి ఎవరికీ చెప్పొద్దు బ్రదర్ అని బతిమాలి వెళ్లాడన్నారు.బోరుగడ్డ రెగ్యులర్ గా క్రాస్ రోడ్స్ రెస్టారెంట్స్ కు వస్తాడని తనకు తెలిసిందని అతను వెల్లడించాడు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications