కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాంకు కుంభకోణం: చిక్కుల్లో మంత్రి ఆది, ఆ డబ్బు ఏం చేశారు?

ఈ డబ్బును మంత్రి బంధువు, చైర్మన్‌ హృషి కేశవరెడ్డే మాయం చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

కడప: మంత్రి ఆదినారాయణరెడ్డి ఓ కుంభకోణం వివాదంలో చిక్కుకున్నారు. ఆది, ఆయన బంధువర్గం ఆధీనంలో నడుస్తున్న జమ్మలమడుగు టౌన్‌ బ్యాంకు లావాదేవీల్లో రూ.2కోట్లు దారి మళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికే ఆది వియ్యంకుడు, కేశవరెడ్డి సంస్థల అధినేత కేశవరెడ్డి వందల కోట్ల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. దానికి తోడు ఇప్పుడీ బ్యాంకు వివాదం కూడా తెర పైకి రావడంతో మంత్రి ఆది ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.

అప్పట్లోనే బ్యాంకు దివాలా:

అప్పట్లోనే బ్యాంకు దివాలా:

కారణాలేవో తెలియదుగానీ జమ్మలమడుగు టౌన్‌ బ్యాంకు గతంలోనే దివాలా తీసింది. దీంతో సహకార శాఖ దీనికి లైసెన్స్ కూడా రద్దు చేసింది. అయితే మళ్లీ ఈ బ్యాంకును నడిపించాలన్న ఉద్దేశంతో క్రెడిట్ సొసైటీ పేరుతో వ్యాపారానికి అనుమతినిచ్చింది.

Recommended Video

YSRCP MP Over Sadawarti Lands చంద్రబాబు దోపిడీకి అదే పెద్ద సాక్ష్యం | Oneindia Telugu
ఆది కుటుంబం ఆధీనంలోనే:

ఆది కుటుంబం ఆధీనంలోనే:

బ్యాంకు దివాలా తీసిన సమయంలో మంత్రి ఆది కుటుంబం.. అన్నీ తాము చక్కదిద్దుతామని ఖాతాదారులకు భరోసా ఇచ్చింది. అలా రాష్ట్ర సహకార శాఖమంత్రి ఆదినారాయణరెడ్డి బంధువు తాతిరెడ్డి హృషికేశవరెడ్డి ఈ సొసైటీ పాలక వర్గానికి చైర్మన్‌ అయినట్లు చెబుతున్నారు.

మంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగాను, మంత్రి తమ్ముడు శివనాథరెడ్డి డైరెక్టర్‌గాను వ్యవహరిస్తున్నారు. మంత్రి బావ, జమ్మల మడుగు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తులసి భర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు.

మంత్రి కుటుంబం ఆధీనంలో నడుస్తున్న ఈ బ్యాంకులో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు దాకా రూ 2 కోట్లు పక్క దారి పట్టాయన్న ఆరోపణలున్నాయి. ఈ డబ్బును మంత్రి బంధువు, చైర్మన్‌ హృషి కేశవరెడ్డే మాయం చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భయపడ్డ ఖాతాదారులు:

భయపడ్డ ఖాతాదారులు:


టౌన్ బ్యాంకు డిపాజిట్లు దారి మళ్లుతున్నాయన్న సమాచారం తెలిసినా.. ఆది కుటుంబం పట్ల ఉన్న భయంతో కొంతమంది ఖాతాదారులు ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు. తమపై ఎక్కడ కక్ష సాధింపుకు దిగుతారోనన్నది వారి భయం. బతిమాలో, ప్రాధేయపడో.. తమ డబ్బులు తాము తెచ్చుకోవాలని వారు భావించారు. కానీ వాళ్లతో విషయం తేలేలా కనిపించకపోవడంతో ఖాతాదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయక తప్పలేదు.

ఎట్టకేలకు చర్యలు:

ఎట్టకేలకు చర్యలు:

డబ్బు పక్కదారిని పట్టిన జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో.. చైర్మన్, సీఈవో మీద పోలీసు కేసులు పెట్టారు. మంగళవారం చైర్మన్‌ ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేశారు. తాము అటాచ్‌మెంట్‌ చేసిన ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపరాదని సంబంధిత అధికారులకు లేఖలు పంపారు.

English summary
AP Minister Adi Narayana Reddy's relative Hrishi Kesha Reddy, chairman of Jammalamadugu Co-operative bank was involved in a scam of Rs.2cr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X