వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామసుబ్బారెడ్డి Vs ఆది: అయిపోలేదు, చంద్రబాబుకు తాజా తలనొప్పులు

కడప జిల్లా జమ్మలమడుగు టిడిపిలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జమ్మలమడుగు: కడప జిల్లా జమ్మలమడుగు టిడిపిలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడికి ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఛైర్మెన్ పదవిని ఇవ్వకపోతే రాజకీయాల నుండి తప్పుకొంటానని మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటించడం కలకలాన్ని రేపుతోంది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టు ఇవ్వకపోతే ఆలోచించాల్సి వస్తోందని రామసుబ్బారెడ్డి సోదరి హైమావతి ప్రకటించడం

జమ్మలమడుగు అసెంబ్లీ స్తానంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి. సుదీర్ఘకాలంగా ఆదినారాయణరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరారు. ఏడాదిన్నర క్రితం ఆయన టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదినారాయణరెడ్డికి చంద్రబాబునాయుడు మంత్రి పదవిని కట్టబెట్టారు.

రెండేళ్ళు జైల్లో ఉన్నా, పార్టీ మారే ఆలోచన రాలేదు: రామసుబ్బారెడ్డిరెండేళ్ళు జైల్లో ఉన్నా, పార్టీ మారే ఆలోచన రాలేదు: రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు నియోజకవర్గంలో మొదటి నుండి టిడిపిలో కొనసాగింది రామసుబ్బారెడ్డి కుటుంబం. అయితే ఆదినారాయణరెడ్డిని టిడిపిలో రాకుండా రామసుబ్బారెడ్డి శక్తివంచన లేకుండా ప్రయత్నాలను చేశారు.కానీ, సాధ్యం కాలేదు. ఎమ్మెల్సీ పదవితో రామసుబ్బారెడ్డి సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఆది ఎఫెక్ట్‌తో రామసుబ్బారెడ్డికి, బైపోల్‌తో ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవులుఆది ఎఫెక్ట్‌తో రామసుబ్బారెడ్డికి, బైపోల్‌తో ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవులు

ఈ రెండు వర్గాలను పార్టీలో సమన్వయం చేసుకోవడం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగానే ఉంది. తమ వర్గాన్ని సంతృప్తి పర్చుకొనేందుకుగాను ఆది. రామసుబ్బారెడ్డిలు తీవ్రంగానే పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

ఆది సంచలన కామెంట్

ఆది సంచలన కామెంట్

తన కొడుకు సుధీర్‌రెడ్డికి ఏపీ వైద్య విధాన పరిషత్ పాలకమండలి ఛైర్మెన్ పదవిని ఇవ్వకపోతే రాజకీయాల నుండి తప్పుకొంటానని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన ప్రకటన టిడిపి నాయకత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో నువ్వా నేనా అంటున్న ఆది, రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య మరింత వేడి పుట్టింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒకరిపై మరోకరు తమ ఆదిపత్యాన్ని సాధించుకొనేందుకుగాను వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.

Recommended Video

Nandyal By Polls : Balakrishna Targets YS Jagan In Road Show | Oneindia Telugu
జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్టు రామసుబ్బారెడ్డికే

జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్టు రామసుబ్బారెడ్డికే

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డిని నామినేట్ చేసినందున 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు టిడిపి టిక్కెట్టు దక్కే అవకాశం లేదనే ప్రచారం కూడ ఉంది. అయితే ఇటీవల జరిగిన పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి శాశ్వతం కాదు, ఎమ్మెల్యే టిక్కెట్టును రామసుబ్బారెడ్డికి కేటాయించే అంశాన్ని పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

టిక్కెట్టు ఇవ్వకపోతే ఆలోచించుకొంటాం

టిక్కెట్టు ఇవ్వకపోతే ఆలోచించుకొంటాం

జమ్మలమడుగు టిడిపి టిక్కెట్టును వచ్చే ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి కేటాయించకపోతే ఏం చేయాలో ఆలోచించుకోవాల్సి వస్తోందని మాజీ మంత్రి శివారెడ్డగి కూతురు హైమావతి టిడిపి నాయకత్వానికి హెచ్చరికలు పంపారు. శివారెడ్డిని ప్రత్యర్థులు హత్య చేసిన తర్వాత రామసుబ్బారెడ్డి ఈ స్థానం నుండి అసెంబ్లీకి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రామసుబ్బారెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. శివారెడ్డిని హత్య చేసిన ప్రత్యర్థుల హత్యకేసులో రామసుబ్బారెడ్డికి శిక్ష పడడంతో ఆయన మంత్రివర్గం నుండి వైదొలిగారు.

ఆది పెత్తనంతో రామసుబ్బారెడ్డి వర్గీయుల్లో కలవరం

ఆది పెత్తనంతో రామసుబ్బారెడ్డి వర్గీయుల్లో కలవరం

జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపిలో పార్టీలోకి కొత్తగా వచ్చిన మంత్రి ఆదినారాయణరెడ్డి పెత్తనం చేయడాన్ని రామసుబ్బారెడ్డి వర్గీయులు తట్టుకోలేకపోతున్నారు. తమ ఆధిపత్యాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా ఆదినారాయణరెడ్డి నియోజకవర్గంలో పై చేయిసాధిస్తున్నారనే అభిప్రాయం రామసుబ్బారెడ్డి వర్గీయుల్లో ఉంది. ఈ తరుణంలో పార్టీలో ఆధిపత్యాన్ని నిలుపుకొనే ప్రయత్నాన్ని రామసుబ్బారెడ్డి వర్గీయులు చేస్తున్నారు. అయితే ఆదినారాయణరెడ్డి కూడ తన పట్టును చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.తన కొడుకుకు ఏపీ వైద్యవిధాన పరిషత్ పాలకమండలి ఛైర్మెన్ పదవి ఇవ్వకపోతే రాజకీయాల నుండి తప్పుకొంటానని హెచ్చరించారు.

English summary
Ap minister Adinarayana reddy demanded to Chandrababu naidu give Ap vaidya vidhana parishat chairmen post to his son Sudheer reddy. Former minister Ramasubba reddy family members demanded to Chandrababu naidu give Jammalamadugu Tdp ticket in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X