వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రోజా మందు తాగడం మానేయాలి, ప్రశాంత్ కిషోర్‌తో భయం లేదు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజాపై మంత్రి, టిడిపి నేత అమర్నాథ్ రెడ్డి బుధవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజాపై మంత్రి, టిడిపి నేత అమర్నాథ్ రెడ్డి బుధవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మంత్రులు అందరూ మందు బాబులు ఉన్న ఆమెకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తొలుత రోజా మందు తాగడం మానేయాలని ఎద్దేవా చేశారు.

ఇదీ ఆయుధం: ప్రశాంత్ కిషోర్ 'వ్యూహాల'పై బాబు కన్ను, దెబ్బకొట్టేందుకు.., పవన్ పైనా..ఇదీ ఆయుధం: ప్రశాంత్ కిషోర్ 'వ్యూహాల'పై బాబు కన్ను, దెబ్బకొట్టేందుకు.., పవన్ పైనా..

రుణమాఫీని వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు, ఇప్పుడు వరాలు ఇస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. గత ఎన్నికల్లో జగన్‌కు అతివిశ్వాసం ఉంటే ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందన్నారు. జగన్ ఎన్ని యాత్రలు చేసినా టిడిపికి వచ్చే నష్టం లేదన్నారు.

పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రి కాలేరు

పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రి కాలేరు

వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు వైయస్ జగన్ పాదయాత్ర చేయాలనుకోవడం విడ్డూరమని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. పాదయాత్రలు చేస్తే ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు.

Recommended Video

Chandrababu Master Plan Behind YSRCP Leaders AP Cabinet Ministries
బుద్ధి ఉంటే..

బుద్ధి ఉంటే..

బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా మేనిఫెస్టో చెప్పుకొని పాదయాత్రలు చేయడని ఎద్దేవా చేశారు. అసలు జగన్‌కు ఏం అర్హత ఉందని ప్రజలు ఆయనను నాయకుడిగా ఎన్నుకుంటారో చెప్పాలన్నారు.

డబ్బులిచ్చి సలహాదారులను తెచ్చుకుంటే..

డబ్బులిచ్చి సలహాదారులను తెచ్చుకుంటే..

డబ్బులు ఇచ్చి సలహాదారులను పెట్టుకునే వాళ్లకు చంద్రబాబును విమర్శించే స్థాయి, నైతిక హక్కు లేదన్నారు. ప్రశాంత్ కిషోర్‌ను చూసి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. విభజన నేపథ్యంలో చంద్రబాబు మాత్రమే సమర్థుడని నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు.

జగన్, రోజాలకు కనీస పరిజ్ఞానం లేదు

జగన్, రోజాలకు కనీస పరిజ్ఞానం లేదు

జగన్, రోజాలకు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. విశాఖ భూకుంభకోణం విషయమై స్పందిస్తూ.. సిట్ నుంచి తనకు లేఖ అందినా, అందకపోయినా సహకరిస్తానని చెప్పారు. తాను చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా అందిస్తానని చెప్పారు. కాగా, విశాఖ భూకుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు రాజకీయ నాయకులకు లేఖలు రాశారు. మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుతో పాటు ప్రతిపక్ష నేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులకు లేఖలు రాశారు. విశాఖ భూకుంభకోణంపై ఆధారాలు ఏవైనా ఉంటే ఇవ్వాలని వారు లేఖల్లో కోరారు.

English summary
TDP leader and Minister Amarnath Reddy on Wednesday suggested Nagari YSR Congress Party MLA Roja to avoid liquor. He also said no one believing YS Jagan's promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X