చంద్రబాబుతో చర్చకు ఒకే ఒక్క షరతు- బావురుమనకూడదు మరి

YSRCP Siddham: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన సవాల్‌ను జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్వీకరించారు. ఆయనతో చర్చకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలోనైనా సరే చర్చించడానికి సిద్ధమేనని అన్నారు.

మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. చంద్రబాబుతో చర్చపై తాను ఒకే ఒక్క షరతు పెడుతున్నానని మెలిక పెట్టారు. చర్చ పూర్తయ్యాక చంద్రబాబు బావురుమని ఏడవకూడదని ఎద్దేవా చేశారు.

 Minister Ambati Rambabu lashes out at Chandrababu Naidu over AP State Development

సిద్ధం బహిరంగ సభలకు లభిస్తోన్న జనాదరణను చూసి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నికల్లో విజయంపై ఉన్న భ్రమలన్నీ తొలిగిపోతున్నాయని అంబటి రాంబాబు అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని, ఆ విషయం టీడీపీకి కూడా తెలుసునని చెప్పారు.

175 స్థానాలకు 175 గెలుస్తామనే ధీమాను అంబటి వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చకు రమ్మని సిగ్గులేకుండా చంద్రబాబు సవాల్‌ విసురుతున్నారని, అసెంబ్లీ నుంచి పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్‌ను సవాల్‌ చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబుతో చర్చకు ఎవరో ఎందుకు.. తానే సిద్ధంగా ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు.

కుర్చీలు మడతబెట్టడంలో నారా లోకేష్‌ది గిన్నిస్‌ బుక్ రికార్డ్ అంటూ చురకలు అంటించారు. శాసనమండలి, అయిదు శాఖల మంత్రి పదవి, మంగళగిరిలో ఎమ్మెల్యే టికెట్‌ను లోకేష్ మడతపెట్టాడని, టీడీపీని కూడా మడతబెట్టేస్తాడని అన్నారు. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామని, ఈ ఎన్నికల అనంతరం టీడీపీ ఖతమౌతుంద‌ని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+