టీడీపీకి ఈ పరిస్థితికి కారణం లోకేశ్ - మంత్రి అంబటి..!!
తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితికి లోకేష్ కారణమని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన తెలుగు దేశం పార్టీని కాపాడటం ఎవరి వల్ల కాదని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పటం లేదన్నారు. 17ఏ చూపించి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పైన కక్ష్య సాధించాలంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జరిగేదని..ఇప్పుడు పూర్తి ఆధారాలతో అరెస్ట్ జరిగిందని మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.
టీడీపీ ఈ రకంగా నాశనం అవ్వటానికి లోకేశ్ కారణమని మంత్రి అంబటి పేర్కొన్నారు. పవన్‌కు ఏ బలం ఉందని టీడీపీకి మద్దతు ఇస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కక్షసాధింపు ఏంటిని ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పారు. ఆలోచన లేకుండా లోకేశ్ మాట్లాడిన కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని అంబటి వివరించారు. చంద్రబాబు సైతం వైఎస్సార్ తనను ఏం చేయలేకపోయారంటూ జగన్ గురించి మాట్లాడారని గుర్తు చేసారు. పార్టీ నిర్ణయించిన విధంగా ఈ నెల 26 నుంచి వైయస్‌ఆర్‌సీపీ బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

చంద్రబాబు అరెస్టైతే చాలా మంది చనిపోయారని టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తుంటే... లోకేష్ మాత్రం ఢిల్లీలో ఉంటున్నారని అంబటి చెప్పుకొచ్చారు. నిజంగా చంద్రబాబు అరెస్ట్ వార్త విని అంతమంది చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి, ఢిల్లీ ఎందుకు పోయారని ప్రశ్నించారు. టీడీపీకి ఇంకా ఏమైనా ప్రాణం ఉంటే అది కూడా పోగొట్టే పనిలో లోకేష్ ఉన్నాడనే విషయం ఆ పార్టీ శ్రేణులు గుర్తించాలని అంబటి సూచించారు. టీడీపీకి తన మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్, వారాహి యాత్రలో మాత్రం టీడీపీ పని అయిపోయింది అని అంటున్నారని గుర్తు చేశారు. టీడీపీకి ఇంకా 23 సీట్లయినా వచ్చాయని..పవన్ కు ఒక సీటే వచ్చిందని చెప్పుకొచ్చారు. కక్ష్య సాధింపుకు వెళ్లాల్సిన అవసరం లేదని..పూర్తిగా పాజిటివ్ ఓటుతోనే గెలుస్తామని అంబటి ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications