ఏం పోయేకాలం వచ్చిందో గానీ..
బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇవ్వాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన సమక్షంలో కండువా కప్పుకొన్నారు. ఆయన చేరికను మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఇవ్వాళ తెలుగుదేశంలో చేరారు. తన అనుచరులతో ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్లారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకే టీడీపీలో చేరానని చెప్పుకొచ్చారు.

ఘాటుగా స్పందించిన అంబటి..
కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. కన్నాను ఏ మాత్రం నైతిక విలువలు లేని వ్యక్తిగా అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారని గుర్తు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ఆయన అలవాటని ఎద్దేవా చేశారు.

బీజేపీలో ఎలా చేర్చుకున్నారు..
బీజేపీకి ఏం పోయేకాలం వచ్చిందో గానీ ఇన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ లో పని చేసిన కన్నా లక్ష్మీనారాయణకు కండువా వేసి మరీ ఆహ్వానించిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే గానీ, సుదీర్ఘకాలం సాధారణ కార్యకర్త స్థాయిలో పని చేసి ఉంటేనే పదవులు ఇస్తామని చెప్పుకొనే బీజేపీ అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణలో ఏం చూసి ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టిందని ప్రశ్నించారు.

అక్కడా తిన్నింటి వాసాలే..
బీజేపీలో చేరిన తరువాత కూడా కన్నా లక్ష్మీనారాయణ తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం మానలేదని, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగియగానే పక్క చూపులు చూడటం మొదలు పెట్టాడని అంబటి రాంబాబు విమర్శించారు. జనసేనలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని, అక్కడ బేరాలు కుదరకపోవడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నాడని ఆరోపించారు.

బేరం కుదిరింది..
చంద్రబాబుతో ఏ బేరం కుదుర్చుకున్నాడోనని, అందుకే కన్నా లక్ష్మీనారాయణ చివరికి తెలుగుదేశంలో చేరాడని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. నైతిక విలువలను సర్వం కోల్పోయిన రాజకీయ నాయకుడు ఆయనొక్కడేనని అన్నారు. పదవుల కోసం ఏ రాజకీయ పార్టీలోనైనా చేరగల సమర్థుడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు మంత్రి పదవులను అనుభవించడాని, బీజేపీలో రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా వ్యవహరించారని చెప్పారు. పదవి కోసమే టీడీపీలో చేరారని ఆరోపించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications