ఈసీ తప్పుడునిర్ణయాలు.. అవగాహన లేని డీజీపీ, ఎస్పీల వల్లే దాడులు: మంత్రి అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అవగాహన లేని డీజీపీ,ఎస్పీలను నియమించటం వల్లనే హింస జరిగిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. డిజిపి కార్యాలయానికి వెళ్లి టీడీపీ దాడులపై ఫిర్యాదు చేసిన వైసిపి ప్రతినిధులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని తదితరులు వైసిపి కేడర్ పై తెలుగుదేశం పార్టీ దాడులపై మండిపడ్డారు.

టీడీపీ పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేసింది
డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు పోలీస్ వ్యవస్థలో కొంతమంది టీడీపీతో కలిసిపోయారని ఆరోపణలు గుప్పించారు. తమకు బాగా ఓట్లు పడే చోట భారీగా పోలీసులను పెట్టి టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను నియమించలేదని, దీంతో వారు పోలింగ్ బూతులను పూర్తిగా క్యాప్చర్ చేశారని ఆరోపించారు.

Minister Ambati Rambabu said attacks in AP due to Wrong decisions of EC DGP and some SPs

ఈసీ తప్పుడు నిర్ణయం వల్లే ఇదంతా
తనను హౌస్ అరెస్టు చేసి తన ప్రత్యర్థిని యధేచ్చగా తిరగనిచ్చారని, దీంతో వారు చాలా దుర్మార్గపు చర్యలకు దిగారన్నారు. పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి వారిని మార్చడం వల్లనే ఇంత హింస జరిగిందంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు పోలీసుల వైఫల్యం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రీ పోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెప్తుంది
రిటైర్డ్ అధికారి అయిన పోలీస్ పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధరేశ్వరి ఆదేశాలతోనే పనిచేశారని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఏపీలో శాంతిభద్రతల వైఫల్యంపై సీరియస్ అయిన ఈసీ సీఎస్, డీజీపీ లను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడింది అని చెబుతున్న రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఎలా చెబుతుంది అంటూ మండిపడ్డారు.

ఈసీ మార్చిన అధికారులకు అవగాహన లేకనే దాడులు
వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడుతో సహా అనేక ప్రాంతాలలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని. ఎన్నికల సంఘం మార్చిన కొత్త అధికారులకు సరైన అవగాహన లేని కారణంగా దాడులు జరిగాయని అన్నారు.డీజీపీని కూడా కొత్తగా నియమించడం వల్ల ఆయన కూడా ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో ఫెయిల్ అయ్యారని రాష్ట్రం మీద అవగాహన లేకనే ఇదంతా జరిగిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+