ఒకే ఒరలో రెండు కత్తులు కుదురుతుందా? జనసేన టీడీపీ కుమ్ములాటపై మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి జనసేన పొత్తులను వైసీపీ పదేపదే టార్గెట్ చేస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి టిడిపి జనసేన పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను పదేపదే వైసిపి టార్గెట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పార్టీ పెట్టారని తీవ్ర స్థాయిలో వైసిపి నేతలు విరుచుకుపడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా జగ్గంపేటలో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం జరిగిందని, టిడిపి, జనసేన నేతలు బాహాబాహీకి దిగారని, అప్పుడే తన్నుకు చస్తున్నారని వైసిపి నేతలు తాజాగా జరిగిన ఘర్షణను పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ఇక టిడిపి అధినేత చంద్రబాబుపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పదేపదే విమర్శలవర్షం కురిపించే ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు జనసేన టిడిపి పొత్తులపై తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఒక ఒరలో రెండు కత్తులు ..కుదురుతుందా ? పాము-ముంగీసా స్నేహం ..కుదురుతుందా ? అంటూ ప్రశ్నించిన ఆయన, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ రెండు కత్తులు లాంటివని , అవి ఒకే ఒరలో ఉండడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఇదే సమయంలో పాముకు ముంగీసకు శత్రుత్వం ఉంటుందని, ఆ రెండింటికి స్నేహం కుదురుతుందా చెప్పాలని ప్రశ్నించారు.
అలాగే టిడిపి, జనసేన పొత్తు కూడా సాధ్యం కాదని తనదైన శైలిలో అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. అంతకుముందు కూడా టిడిపితో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం పై టార్గెట్ చేసిన అంబటి రాంబాబు సూట్ కేస్ తీసుకుని లోకేష్ తో కలిసిపో అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.
ఇక జనసేన టిడిపి పొత్తులను రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సమయంలో కూడా రాజమండ్రిలో పాత కలయికకు కొత్త రూపం జీరో ప్లస్ జీరో ఈక్వల్ టు జీరో అంటూ అంబటి రాంబాబు టార్గెట్ చేశారు. టిడిపి జనసేన పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి నేటి వరకు ఏ చిన్న సందర్భంగా దొరికినా మంత్రి అంబటి రాంబాబు అటు పవన్ కళ్యాణ్ ను, ఇటు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.












Click it and Unblock the Notifications