చంద్రబాబు సహా టీడీపీలో ఒక్కరూ బయటతిరగలేరు: మంత్రి అనిల్ కుమార్ తీవ్ర హెచ్చరిక
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కైలా అనిల్ కుమార్‌పై జరిగిన దాడిని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. అంతేగాక, టీడీపీ నేతలకు గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు. తాము కూడా దాడులకు దిగితే టీడీపీ అధినేతతోపాటు ఎవరూ కూడా బయట తిరగలేరని అన్నారు.

చంద్రబాబు గల్లీ లీడర్ స్థాయికి..
వైసీపీ నేతలపై దాడులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారుడు తనానికి నిదర్శనమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచస్థాయి నేతగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. గల్లీ లీడర్‌లా మారిపోయారని విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా.. హత్యాయత్నం జరిగినా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి, 16 నెలలు పాటు జైల్లో పెట్టినప్పటికీ వైసీపీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ దాడులకు దిగలేదని అన్నారు మంత్రి అనిల్. ఆఖరికి జగన్ మీద హత్య ప్రయత్నం జరిగినా కూడా ఈ రాష్ట్రంలో జగన్ అభిమానులు సంయమనంతోనే ఉన్నారని తెలిపారు. ఎక్కడ దాడులు చేయలేదన్నారు.

చేతికాక కాదు..
అయితే, తమకు చేతకాక కాదని, తమ నాయకుడు బాటలోనే నడుస్తున్నామని, అందుకే దాడులకు దిగలేదని.. పదేళ్లుగా హింసలేకుండా తమ నాయకుడు నడుస్తున్నారని, తమను నడిపిస్తున్నారని మంత్రి అనిల్ చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు సిగ్గుచేటని ఆయన అన్నారు.

చంద్రబాబు సహా ఒక్కరూ బయట తిరగలేరు..
తాము కన్నెర్ర చేస్తే.. తాము దాడులు మొదలు పెడితే చంద్రబాబు సహా టీడీపీ నేతలు, కార్యకర్తలు బయట తిరగలేరని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. రైతులు చంద్రబాబు మాయలో పడొద్దని, రైతులను ఆదుకునేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

దాడి చేసింది టీడీపీ గూండాలే..
మరోవైపు తమపై దాడి చేసింది రైతులు కాదని.. టీడీపీ గూండాలేనని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, దమ్ముంటే ముసుగు తీసి బయటకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఎక్కడికి రమ్మంటే వచ్చేందుకు తాను సిద్ధమని అన్నారు. చంద్రబాబు పక్కా ప్లాన్ ప్రకారమే తనపై హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. ఆయన ఆస్తులను కాపాడుకునేందుకే అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై దాడులకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications