చేతగానితనానికి కేరాఫ్ లోకేష్ ; నిన్ను చూసి భయపడేవాళ్ళు లేరు : మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. లోకేష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడిన ఆయన ఇకనైనా చిల్లర రాజకీయాలు చేయడం లోకేష్ మానుకోవాలని హితవు పలికారు. చేతకానితనానికి లోకేష్ కేరాఫ్ అడ్రస్ అని లోకేష్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ . నారా లోకేష్ ను ఒక అసమర్థుడు గా పేర్కొని ధ్వజమెత్తారు అనిల్ కుమార్ యాదవ్.

లోకేష్ వ్యాఖ్యలు హాస్యాస్పదం .. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వంది చంద్రబాబే
నెల్లూరు నియోజకవర్గంలో ఏడు వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయినట్లు వెల్లడించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల నెల్లూరు పర్యటనలో అధికార పార్టీపై విమర్శలు చేసిన నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. లోకేష్ విమర్శలు హాస్యాస్పదమని, లోకేష్ ని చూసి ఎవరూ భయపడరని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని విమర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాడు చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేసిందని మండిపడ్డారు.

లోకేష్ లా తాత, తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చెయ్యటం లేదు
తాము లోకేష్ తరహాలో తండ్రి, తాతను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ ను ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 30వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్న అనిల్ కుమార్ యాదవ్ వైసిపి ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. లోకేష్ ఇకనైనా చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ ఆశీస్సులతో తాము రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పని చేస్తున్నామని మంత్రి అనిల్ పేర్కొన్నారు.

నెల్లూరు పర్యటనలో వైసీపీ నాయకులను టార్గెట్ చేసిన లోకేష్
ఇక ఇటీవల నెల్లూరు పర్యటన సందర్భంగా నారా లోకేష్ వైసిపి నేతలపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. నెల్లూరులో నిరుద్యోగ యువకుడు కమల్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్ వైసిపి నాయకులు కమల్ కుటుంబాన్ని మాయం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డ కమల్ ను తిరిగి తీసుకు వస్తారా అంటూ ప్రశ్నించారు. తాను పరామర్శకు వస్తుంటే వైసిపి నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు లోకేష్.

తనను చూసి భయపడుతున్నారన్న వ్యాఖ్యలకు అనిల్ రివర్స్ కౌంటర్
తన పర్యటన నేపథ్యంలో కమల్ కుటుంబాన్ని తనకు కలవకుండా వైసీపీ నాయకులు మాయం చేశారని, వారిని తాను కలిస్తే నిజాలు బయటకు వస్తాయని వైసీపీ నాయకులు భయపడ్డారని విమర్శించారు.ఫేక్ రెడ్డి రిలీజ్ చేసిన ఫేక్ క్యాలెండర్ యువకులను బలి తీసుకుంటుంది అని లోకేష్ నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ఫేక్ క్యాలెండర్ ను రద్దుచేసి 2.1 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇక నెల్లూరు జిల్లా పర్యటనలో వైసీపీ నాయకులు తనను చూసి భయపడుతున్నారన్న వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications